
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు సుల్తాన్ బజార్ పోలీసులు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నది పాపమ్మ కుటుంబం. ఆమె కుమారుడు సుధీర్ అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఎక్సర్‌సైజ్ (వ్యాయామం) చేస్తున్నాడు. తల్లి పాపమ్మ అర్థరాత్రి పూట ఎందుకు అని మందలించడంతో దీంతో ఆవేశానికి గురైన సుధీర్ అత్యంత దారుణంగా ఇనుపరాడ్డుతో తల్లి తలపై బలంగా కొట్టాడు. ఆ సైకో కొడుకు. ఈ హఠాత్తు పరిణామంతో అడ్డుగా వచ్చిన చెల్లిని కూడా రాడ్డుతో కొట్టాడు. ఇద్దరూ రక్తపు మడుగులో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేసారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే తల్లి పాపమ్మ మృతి చెందింది. చెల్లికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన పాపమ్మను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకీ తరలించారు. అయితే గత కొద్ది రోజులుగా సుధీర్ సైకోగా మారి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సుధీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి కూడా కొద్దిపాటి గాయాలు కావడంతో అతన్నీ కూడా చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.