ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది . టెక్నాలజీ ద్వారా కూర్చున్న చోటికే అన్ని తెప్పించుకో గలుగుతున్నాడు మనిషి. ఏదైనా కావాలంటే బయటికి వెళ్లాల్సినా అవసరమే లేకుండా పోయింది. స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు ఇక అన్ని వస్తువులు ఇంటి ముంగిటకే డెలివరీ అవుతున్నాయ్. ఈ క్రమంలోనే సరికొత్త టెక్నాలజీతో అందరికీ ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయ్. అదే సమయంలో వినూత్నమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కారణంగా అటు జనాలకు తిప్పలు కూడా తప్పడం లేదు అన్నది తెలుస్తుంది.


 ఎందుకంటే ఆన్లైన్ లో ఏం చేయాలన్న భయపడే పరిస్థితి ఏర్పడింది.  ఎందుకంటే అప్రమత్తంగా లేకపోతే కుచ్చుటోపీ పెట్టి ఖాతా ఖాళీ చేసేందుకు నేటి రోజుల్లో ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఇక అకౌంట్లో డబ్బులు అన్నీ కాచేస్తూ ఉన్నారు.  ఇటీవలే పూణే లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ లో బర్త్ డే కేక్ ఆర్డర్ చేసింది ఓ యువతి. కానీ ఆ తర్వాత జరిగింది తెలిసి లబోదిబోమంటూ ఏడ్చేసింది. ఇంతకీ ఏం జరిగిందా అనుకుంటున్నారు కదా.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 1.67 లక్షలు పోగొట్టుకుంది యువతి.


 చివరికి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. మోషే కి చెందిన ఓ మహిళ తన బర్తడే కేక్ కోసం ఆన్లైన్లో వెతికింది. ఈ క్రమంలోనే ఒక కేక్ షాప్ నెంబర్ తీసుకుని 400 విలువైన కేక్ ని ఆర్డర్  చేసింది. ఇక షాప్ ఉద్యోగి ఆర్డర్ తీసుకున్నాడు.  మహిళ కు ఫోన్ చేసి 400 చెల్లించాలని కేక్ డెలివరీ చేస్తామని చెప్పాడు. ఈ క్రమంలోనే చెల్లింపు కోసం ఒక క్యూఆర్ కోడ్ షేర్ చేశాడు. మహిళా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చెయ్యగానే 2000 కట్ అయ్యాయి. అయితే ఇదేంటని ప్రశ్నిస్తే 400 మినహా మిగతా డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ కాసేపటికి 10000 అప్రమత్తం అయ్యేలోపే 1.67 లక్షలు అకౌంట్ నుంచి మాయం అయ్యాయి. దీంతో లబోదిబోమంటూ  వెంటనే పోలీసులను ఆశ్రయించింది మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి: