ఏంటో.. అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాల్సిన భార్య భర్తల బంధం నేటి రోజుల్లో మాత్రం హత్యలకు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారి పోతుంది అనే చెప్పాలి. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నీడగా ఉంటూ ఎప్పుడు కలసిమెలసి బ్రతకాల్సిన భార్యా భర్తలు చిన్న చిన్న మనస్పర్ధలు తోనే విడి పోతున్న పరిస్థితి ఏర్పడింది. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ అభిమానం ఉండాల్సిన భార్య భర్తలు.. బద్ద శత్రువులు గా మారి పోతు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి.


ఇలా భార్య భర్తల మధ్య ఇటీవల కాలం లో తలెత్తిన చిన్నపాటి గొడవలు ఏకంగా ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొంతమంది దారుణ హత్యలకు గురవుతున్నారు. ఇక్కడ భర్త కట్టుకున్న భార్యను దారుణంగా చంపేశాడు. అయితే భార్య గర్భవతి అన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఇంతకీ భర్త భార్యను దారుణంగా హత్య చేయడానికి గల కారణం ఏంటో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు అందరూ.


 అన్నం పెట్టలేదు అన్న కారణంతో భార్యను చంపేసాడు భర్త. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మన పల్లె చెంచు కాలనీ లో ఈ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో  భర్త గర్భవతైన భార్యను హత్య చేశాడు. భార్యపై భర్త  కర్రలతో దాడి చేశాడు. అయితే తాగి వచ్చిన తనకు రాత్రి అన్నం పెట్టే లేదన్న కారణంతో భర్త అంకాలు హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అని చెప్పాలి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: