బీహార్లో మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే . అయితే ప్రభుత్వం ఇలా మద్యపాన నిషేధం విధించినప్పటికీ కూడా ఇక రాష్ట్రంలో అక్కడక్కడ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఎక్కడ ఎవరికంటా పడకుండా గుడ్డు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉంటూ ఇక మద్యం గుట్టుగా విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసి ఇక పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇలాంటి సమయంలోనే కొంతమంది పోలీసులు మాత్రం ఏకంగా ప్రభుత్వం మద్యపాన నిషేధం లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు అని చెప్పాలి. ఏకంగా కంచే చేనును మేసింది అన్న చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పాట్నా జిల్లాలోని పాలిగంజ్ నగరంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఇక ఇలా ఇక వారు అక్రమంగా తరలిస్తున్న మధ్యాన్ని కూడా సీజ్ చేశారు. కానీ ఆ తర్వాత ఊహించని ఘటన చోటుచేసుకుంది. అదే రోజు పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్స్ ఖైదీలతో కలిసి సీజ్ చేసిన మద్యంతో ఫుల్ పార్టీ చేసుకున్నారు అని చెప్పాలి.


 అంతటితో ఆగకుండా ఇలా పార్టీ చేసుకున్న విషయాన్ని మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో ఏకంగా పాట్నా సీనియర్ అధికారులు చూసి షాక్ అయ్యారు. వెంటనే సదర్ కానిస్టేబుల్ లపై చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే అయిదుగురు ఖైదీలతో పాటు వారితో మద్యం పార్టీ చేసుకున్న ఇద్దరు కానిస్టేబుల్ లను కూడా అరెస్టు చేసి దర్యాప్తు చేశారు అని చెప్పాలి. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: