పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. యువతి యువకులు ఇద్దరు కూడా పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తమకు నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించాలని ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. మరి కొంతమంది పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇక ఇలా ఎవరిని పెళ్లి చేసుకున్న జీవితాన్ని మాత్రం పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరు కొత్తగా ప్రారంభిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా పెళ్లి చేసుకోవాలని ఆశ కలుగుతూ ఉంటుంది. అయితే ఇలా పెళ్లికి సిద్ధమైనప్పుడు పెళ్లి సంబంధాలు చూడటం జరుగుతూ చేస్తూ ఉంటారు.



 అయితే ఒకప్పుడైతే 25 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేసుకునేవారు అందరూ. కానీ ఇప్పుడు మాత్రం 30 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వివాహం చేసుకోవడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం పెళ్లిళ్లు కావడం లేదని మనస్థాపం  చెందుతున్న వారు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి సెట్ కావడం లేదు అనే మనస్థాపంతో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవల ఒక యువకుడు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చాడు.



 పెళ్లి కావడంలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం సన్యాస పాలెం గ్రామంలో మురళి అనే యువకుడు ఉంటాడు. అయితే అతనికి ఇప్పటికే 37 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటివరకు వివాహం కాలేదు. ఇక పెళ్లి కాలేదు అనే బాధతో మురళి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. చివరికి మనస్థాపంతో గడ్డి మందుతాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని  హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మురళి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: