
జగన్ మీద హత్యాయత్నం కేసు గురించి కోడి కత్తి కేసు అని రాస్తారు. జగన్ పై హత్యాయత్నం అని రాయకుండా కోడి కత్తి కేసు అని రాస్తూ అవహేళన చేస్తున్నారు. జగన్ హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ గురించి విశాఖ ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. శ్రీనివాస్ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించగా.. ఏసీబీ తరఫున తన వాదనలు వినిపించారు. అయితే పోలీసుల విచారణ అసంపూర్తిగా ఉందని పేర్కొన్నారు.
90 రోజుల్లో చార్జీషీటు దాఖలు చేయాల్సి ఉన్నా దాన్ని దాఖలు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేశారని అన్నారు. అయితే పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యం అయింది కాబట్టి శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే జగన్ పై హత్యాయత్నం జరిగిన సమయంలో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ. మరి ఎందుకు 90 రోజుల వరకు చార్జీషీటు ఎందుకు దాఖలు చేయలేదు. నిందితుడి తరఫున వాదిస్తున్న లాయర్ ప్రస్తుతం మాట్లాడిన విధానంలో లోపాలు కనిపిస్తున్నాయి.
కాబట్టి అధికారంలో ఉన్నపుడు ఈ కేసు గురించి టీడీపీ ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని అర్థం అవుతుంది. అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు. కానీ ఎందుకు చార్జీషీటు వేయలేపోయారనేది ఇప్పుడు చర్చనీయాంశం. అయితే శ్రీనివాస్ మాత్రం జగన్ సీఎం అయ్యేందుకే అతడిని పొడిచానని చెబుతున్నారు. మరీ చార్జీషీటు విషయంలో టీడీపీ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.