
అంతే కాదు ఇక అటు పాఠశాలలో కూడా బట్టీపట్టే చదువులే కనిపిస్తూ ఉన్నాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు అదే రీతిలో విద్యాబోధన చేయడంలో మాత్రం విఫలమవుతున్నాయి అని చెప్పాలి. అయితే ఇలా విద్యార్థులు అందరూ కూడా చదువులను భారంగా భావిస్తున్న నేటి రోజుల్లో కూడా ఇంకా చదువులపై మక్కువతో చిన్న వయసులోనే పెద్ద పెద్ద చదువులు చదివే వారు కూడా ఉన్నారు అన్నది నిరూపించేందుకు కొన్ని కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.
సాధారణం గా పదహారేళ్ళ వయసు ఉన్న సమయం లో పదవ తరగతి లేదా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ ఉంటారు విద్యార్థులు. కానీ ఇక్కడ ఒక పదహారేళ్ల బాలుడు మాత్రం పదహారేళ్లకే ఎమ్మెస్సి పూర్తి చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. హైదరాబాద్ కు చెందిన అగస్త్య జైస్వాల్ అనే విద్యార్థి మరో రికార్డును సృష్టించాడు. దేశం లోనే అతిపిన్న వయసులో పీజీ పూర్తి చేసిన విద్యార్థి గా నిలిచాడు. అగస్త్య 9వ ఏటనే ఎస్ఎస్ఎస్సి పూర్తి చేశాడు. ఇక 14వ ఏటా డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఇక ఇప్పుడు 16 ఏళ్లలో ఎమ్మెస్సి పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. తన తల్లిదండ్రుల సహకారం తోనే ఇదంతా జరిగింది అంటూ తెలిపాడు.