తూరుపు ప్రాంత క‌వి అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. క‌వి అంటే గౌర‌వం అని ఆయ‌న ఎన్నో సార్లు చెప్పారు. భాష‌ను భాగ్య రీతిలో సుసంప‌న్న చేసేవారంటే ఆయ‌న‌కు మ‌హా ఇష్టం. శ్రీ‌శ్రీ అంటే ఇష్టం. సిరివెన్నెల అంటే ఇష్టం. బాలుకు కొన్ని ఇష్టాలున్నాయి. అవ‌న్నీ మా ప్రాంతానికి వ‌చ్చిన‌ప్పుడు చెప్పారు. గేదెల ఆనంద్ అనే గాయ‌కులు (ఒక‌ప్పుడు ఎంతో పేరు తెచ్చుకున్న గాయ‌కులు) మీ ప్రాంతం వారే అని చెప్పి, వారికి మ‌రో మారు అభినంద‌న‌లు చెప్పి, ప్రేక్ష‌కులలో క‌ర‌తాళ ధ్వ‌నులు చేయించిన వారు బాలు. స‌మ‌య పాల‌న‌, ప్రాంతాల క‌తీతంగా మ‌నుషుల‌ను ప్రేమించే గుణం ఆయ‌న‌తో ఉన్నాయి. ఆయ‌న‌లో ఉన్నాయి. మీరు మీ త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించండి చాలు అదే గొప్ప కానుక. మీరు సంస్కృతిని కాపాడండి అదే ఈ దేశాన్ని ప‌రిర‌క్షించేంత గొప్ప కానుక అని చెప్తారు. మీ పిల్ల‌ల‌కు సంస్కారం నేర్ప‌డం..గౌర‌వం, మ‌న్న‌న అన్న‌వి అల‌వ‌ర్చండి. మీరు మీ పిల్ల‌ల‌కు స్మార్ట్ ఫోన్లు ఇవ్వ‌కండి.. వాటి వ‌ల్ల వ‌చ్చే దుష్ప‌రిణామాలు మీరు దాట‌లేరు..అని చెప్పారు. 


చెల్లాయ్ శైల‌జ నూ వేదిక‌పై అభినందించి, త‌న పాటల ప్ర‌స్థానాన్నీ వివ‌రించారు. ఎన్నో హుషారు గీతాలు పాడి త‌న గొంత‌కకు ఇంకా శ్రావ్య‌త త‌గ్గిపోలేద‌ని, మాధుర్యం అన్న‌ది ఎక్క‌డికీ పోలేద‌ని చెబుతారు. ఆయ‌న‌కు మా ప్రాంతంలో ఉండి ఎదిగి వ‌చ్చిన జాలాది (పుణ్య భూమి నా దేశం న‌మో న‌మామి పాట రాసిన క‌వి) అంటే ఎంతో ఇష్టం. జాలాది రాజారావు అన్న‌ది ఆయ‌న పూర్తి పేరు. జాలాది పాట ఏత మేసి తోడినా ఏరు ఎండ‌దు అనే ప‌ల్ల‌వితో ప్రాణం ఖ‌రీదు సినిమాలో వినిపించింది. ఆ పాట గురించి ఎప్పుడు చెప్పినా ఎంత గొప్ప‌గా వివ‌రిస్తారో! ఆ ఒక్క పాట అనే కాదు సాహిత్యం వినిపించే వేళ, స్వ‌ర సాహిత్యం వివ‌రించే వేళ బాలు ఆ రోజు ఎంత గొప్ప‌గా క‌నిపించారో! డియ‌ర్ స‌ర్ వి మిస్ యూ.. మా ప్రాంతం పిల్ల‌ల‌ను మీరు దీవించిన రోజు మ‌రువ‌ను.. మా ప్రాంతం గాయ‌కులు ఇవాళ మీకు మా ఊళ్లో మా జిల్లా కేంద్రంలో (శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో) స్వ‌ర నీరాజ‌నాలు అర్పిస్తున్నారు. అందుకోండి మీరు. స్థానిక బాపూజీ క‌ళా మందిరంలో ఉదయం తొమ్మిది గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు,, తిరిగి సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కూ స్వ‌ర నిరాజ‌నం చేయ‌నున్నారు ఇవాళ.. నా స్నేహితులు న‌డిపే మిత్రా ఫౌండేష‌న్ , సిక్కోలు ఫ్యూచ‌ర్స్ ఫౌండేష‌న్ సంయుక్తంగా ఈ రాగ అర్చ‌న‌ను మీకు నివాళిగా అందించ‌నున్నాయి. అందుకోండి. బాలూ స‌ర్ వి మిస్ యూ.....

మరింత సమాచారం తెలుసుకోండి:

tg