మతం అనేది మత్తుమందు అనే నానుడికి.. నిదర్శనంగా  పాకిస్తాన్, ఇంకా శ్రీలంక నిలుస్తున్నాయి. ప్రత్యేకించి పాకిస్తాన్ లో ఈ మత్తుమందుకు బానిసలైపోయిన వారే  చాలామంది. శ్రీలంకలో మతపరమైన సంఘీభావం ఏమీ లేదు. అక్కడ తినడానికి తిండి దొరక్క, చేయడానికి ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు కలిగే దారి లేక, వ్యవసాయం లేక పరిశ్రమలు ముందుకు నడవక కరువు వచ్చిన సందర్భంలో అక్కడ ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. చివరికి వాళ్లను చంపుతున్నా సరే భయపడక ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, ప్రభుత్వంపై దాడి చేసేసరికి అధ్యక్షుడే పారిపోయే పరిస్థితి వచ్చింది.


అదే క్రమంలో ప్రజాస్వామ్య పరిపాలనకు అనుగుణంగా తమ అధ్యక్షుడిని తామే ఎన్నుకొని వారు అక్కడ ముందుకు వెళ్లారు. పాకిస్తాన్ పరిస్థితి అయితే శ్రీలంక కన్నా దారుణంగా ఉంది. పాకిస్తాన్ లో తినడానికి తిండి లేని పరిస్థితి ఉన్నా, గోధుమపిండి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చినా సరే, మతమే అక్కడ శాసిస్తుంది. పాకిస్తాన్ లో 265 రూపాయలకి డాలర్ రేటు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. కరెంటు లేక తిరిగే తిరిగే మెట్రో రైల్ కూడా సగం దారిలో ఆగిపోయే పరిస్థితి అక్కడ  నెలకొంది. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో  రాత్రి పూట అక్కడ మెట్రో రైళ్ళని కూడా నడపడం ఆపివేశారు.


శ్రీలంకలో కన్నా పాకిస్తాన్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నా, పాకిస్తాన్ లో శ్రీలంకలో వచ్చినంత తిరుగుబాటు ఎందుకు రావడం లేదంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు వారు వాళ్ళ ప్రాణానికన్నా మతానికి ఎక్కువ విలువనిస్తారు అక్కడ. అది పాకిస్తాన్ కి శ్రీలంక కి ఉన్న తారతమ్యం. పాకిస్తాన్ లో, అక్కడ వారికి వచ్చే కష్టం కన్నా, వారికి వచ్చే కరువు కన్నా, కరువు కాటకాలతో పోయే ప్రాణాల కన్నా కూడా ఒక వ్యసనంగా మారిపోయిన వారి మతమే అక్కడ వారిని కంట్రోల్ చేస్తుంది. అక్కడ పరిస్థితి చూస్తే మతం అనేది ఒక మత్తుమందు అని ఎందుకు అంటారో అక్షరాల అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: