ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అయిదేళ్లలో పూర్తిగా మద్య నిషేధం చేస్తానని హామీనిచ్చారు. మొదటి ఏడాది అనుకున్నట్లు గానే 20 శాతం వరకు చేశారు. తర్వాతి సంవత్సరం 13 శాతం వరకు జరిగింది. కానీ తదనంతరం ఆ విషయాన్ని అటకెక్కించినట్లు కనిపిస్తోంది. సంపూర్ణ మద్య నిషేధం తర్వాత కేవలం స్టార్ హోటళ్లలోనే మద్యం దొరికేలా ప్లాన్ చేయాలని భావించారు. వివిధ కారణాలతో అది సవ్యమైన దిశలో కొనసాగడం లేదు.


ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది. అయితే ఇందులో డిజిటల్ పేమెంట్లను అంగీకరించడం లేదు. దీనికి కారణాలు మాత్రం చెప్పలేదు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు మద్యం దుకాణాల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్లను అంగీకరించడం లేదని ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను పెట్టేలా చర్యలను ప్రారంభించింది.


మరి ఇన్ని రోజులు డిజిటల్ పేమెంట్లను ఎందుకు అంగీకరించలేదు. దీని వెనక ఉన్న రహస్యం ఏమిటని రాజకీయ పార్టీలు, మందుబాబులు, ప్రతిపక్ష నాయకులు చర్చించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆంధ్రాలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపిస్తోంది. దీని వల్ల ఆదాయం పూర్తిగా ప్రభుత్వానికి రావాలి. డిజిటల్ పేమెంట్లు అయితే కచ్చితమైన లెక్కాపత్రాలు తెలుస్తాయి. దీన్ని ముందు నుంచి అనుసరించాల్సిన ప్రభుత్వం కోర్టు మెట్లెక్కితే గానీ దారికి రాలేదు.


దీనికి తోడు ఇక్కడ దొరికే బ్రాండ్లు పక్క రాష్ట్రంలో కూడా ఉండవు. సరికొత్త బ్రాండ్లతో నూతన మద్యాన్ని ఇక్కడ సరఫరా చేస్తున్నారు. కానీ సంపూర్ణ మధ్య నిషేధంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటి వరకు 33 శాతం వరకు మద్య నిషేధాన్ని చేయగలిగారు. కానీ ఇది సంపూర్ణ దిశగా సాగడం లేదు. మరి డిజిటల్ పేమెంట్లను అనుమతించాక ఎక్కడ అవినీతి జరిగింది. ప్రతిపక్షాలు భావించినట్లు ఏమైనా లోటు పాట్లు తెలుస్తాయా, లేదా అన్నది త్వరలోనే తేలుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: