
ప్రస్తుతం దేశంలో 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం భారత్ లో 419 నగరాల్లో 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టోటల్ గా ఇండియానే టాప్ గా ఉంది. అమెరికాలో 296 నగరాల్లో ఉంది. వివిధ దేశాల్లో 57, 65, 90, 95 నగరాల్లో 5 జీ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. చైనాలో 356 నగరాల్లో మాత్రమే 5 జీ సేవలు విస్తరించాయి.
ప్రస్తుతం టాప్ 1 లో భారత్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో అమెరికా, చైనాలు ఉన్నాయి. ఇప్పటివరకు 2జీ, 3జీ, 4జీ, ప్రస్తుతం 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి రావడంతో అత్యంత వేగంగా నెట్ వర్క్ పని చేస్తుంది. ఈ నెట్ వర్క్ తో సెకన్లలో 1జీబీ సినిమాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అత్యంత వేగంగా పని చేస్తుంది.
కాలంతో పాటు అన్ని మారిపోతున్నాయి. నిమిషాల వ్యవధిలో అత్యంత వేగంగా ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవచ్చు. కానీ అంతే స్థాయిలో రేడియేషన్ ఇబ్బంది కలుగుతుందని కొంతమంది విమర్శకులు చెబుతున్న అంశం. గతంలో కంగనా రనౌత్ కూడా 5 జీ వల్ల అత్యంత రేడియేషన్ కు గురవుతారని కోర్టులో కేసు వేసింది. దాన్ని కోర్టు కొట్టివేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా గాలికి కేసులు వేయొద్దని కంగనాను హెచ్చరించింది. 5జీ అనేది మారుతున్న ప్రపంచానికి ఒక మార్గం అని తెలిపింది.