
తర్వాత ఆంధ్రాలో అధిక ఆదాయం వస్తుందని తెలిసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి దగ్గరకొచ్చి కూర్చున్నారు. ఎంతవరకూ అవసరమో అంతవరకు స్పందిస్తారు మన వాళ్ళు. ఒక పక్కన తమిళనాడులో అయితే విపరీత వాదం, హిందీ వ్యతిరేక ఉద్యమం హిందీ అంటే తరిమికొట్టండి ఇలాంటి నినాదాలు. వాళ్లు పద్ధతి ఏంటంటే మన దగ్గరికి ఇంకొకరు రాకుండా ఉండాలంటే ఎదుటి వాడిని తక్కువ చేసి చూపించినట్టు చూపించాలి.
అందులో జరిగే ఇటువంటి ప్రయత్నమే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దాంట్లో భాగంగా నడుస్తున్నటువంటి వ్యవహారంలో కీలకమైన పరిణామం ఏంటంటే ఎవరైతే హిందీ వద్దన్నటువంటి సూర్య తన బిడ్డను తీసుకెళ్లి ముంబైలోని ఒక స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ 70 కోట్లు పెట్టి ఇల్లు కొనడమే కాకుండా జ్యోతికని కూడా అక్కడికి పంపించారు. ఇప్పుడు అదే వాళ్లకి పెద్ద ఇష్యూ అయ్యి కూర్చున్న సందర్భం అయితే వచ్చింది అక్కడ.
ఆ విషయాన్ని పోస్ట్ చేసిన తర్వాత మరి హిందీ భాషలో కూడా చేస్తారు కదా మీరు సినిమాలు, మరి హిందీ మాత్రం వద్దు తరిమి కొట్టండి అని ఎలా మాట్లాడుతారు అని నెటిజెన్స్ సూర్య ఇంకా జ్యోతిక లను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే హిందీ స్కూల్లో అక్కడ హిందీలోనే బోధిస్తారు కదా మరి అక్కడ కూడా తమిళ్లోనే నేర్పించమంటారా లేదా తమిళంలోనే మాట్లాడుతారా అంటున్నారు.