
ఢిల్లీలో ఒక చోట 7 సంవత్సరాల బాలిక పెద్దమనిషి (ప్యూబర్టీ) అయింది. అంటే మినిమం వయసు రాకుండానే ఇలా జరగడం ఆందోళన కలిగించే అంశమే. రుతు స్రావ ప్రక్రియ అనేది స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. దీని ద్వారా ఆమె ఆరోగ్యం, పిల్లలు పుట్టుక, ఇలా అన్ని ఆధారపడి ఉంటాయి. 12 నుంచి 13 సంవత్సరాల సమయంలో ప్యూబర్టీ అయితే వారు 6, 7, లేదా 8 వ తరగతిలో ఉంటారు. స్నేహితులు, తల్లి ఇతర బంధువుల ద్వారా ఎలా ఉండాలో నేర్చుకుంటారు.
7 ఏళ్ల వయసులో ప్యూబర్టీ అంటే తెలిసి తెలియని వయసులో వారు పడే కష్టాలు ఎంతో ఇబ్బందిగా ఉంటాయి. అయితే అమెరికాలో మాత్రం ఆడపిల్లల ప్యూబర్టీ వయసు 7 సంవత్సరాలు మాత్రమేనని తెలుస్తోంది. కానీ భారత్ లో మినిమం 10 సంవత్సరాల యావరేజ్ ఉంది. ఇది కాకుండా కొత్తగా 7 సంవత్సరాలకే ఇలా జరగడం అనేది వింతగా అనిపిస్తుంది. ఇలా జరగడానికి కారణం జంక్ ఫుడ్స్, వాతావరణ సమతుల్యత లోపించడమే కారణమని కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఏదేమైనా ప్రకృతికి విరుద్ధంగా జరిగితే రాబోయే కాలంలో సమస్యలు వస్తాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలతో పాటు సమాజంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.