
మొత్తం మీద పార్టీకి ఒక హైప్ ను తీసుకొచ్చారు. ఎంతలా అంటే ప్రస్తుతం అధికారం చేపడుతున్న కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించేలా. ఆయన కారణంగానే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గాలి వీచింది. ఎప్పుడైతే బండి సంజయ్ ని పదవి నుంచి తప్పించారో ఒక్కసారిగా బీజేపీ పోటీలో లేకుండా పోయింది.
ఒకవేళ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ ఇంకా గట్టిపోటీ ఇచ్చేది అనే స్థాయికి పార్టీని తీసుకెళ్లారు. ప్రస్తుతం బీజేపీ తమ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకున్నా ఇంకా మరింత పోటీలో నిలిచేది. అయితే అంతలా పార్టీ కోసం పనిచేసిన సంజయ్ ని అధిష్ఠానం సడన్ గా బాధ్యతల నుంచి ఎందుకు తప్పించింది అనే అనుమానాలు ఆపార్టీ కార్యకర్తల్లో ఇప్పటికీ ఉంది.
ఒక ముగ్గురు బీజేపీ నాయకులు పదే పదే బండి సంజయ్ పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. అధ్యక్షుడిగా ఎవర్నీ కలుపుకొని వెళ్లడం లేదు అంటూ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పార్టీ పెద్దలకు చేరవేశారు. ఆ ముగ్గురు ఎవరూ అంటే ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి . పదే పదే పార్టీ అధిష్ఠానానికి తప్పుడు నివేదికలతో ఆయన్ను పదవి నుంచి తప్పించారు. బయటి నుంచి వచ్చిన ఈ ముగ్గురి వల్లే పార్టీని నమ్ముకున్న బండి సంజయ్ పదవి కోల్పోయారు. ఆ తర్వాత వివేక్ వెంకటస్వామి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ రెండుచోట్ల ఓడిపోయారు. ఫిర్యాదుల ఫలితం తెలంగాణలో బీజేపీ ఓ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది.