
మిగిలిన మూడు రాష్ట్రాలలో అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసింది. మరొక రాష్ట్రంలో మాత్రం గతంలో నాలుగు సీట్లు ఉన్నటువంటి స్థానం నుండి ఒక స్థానానికి పడిపోయిన పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ కు . గతంలో నాలుగు స్ధానాలు ఉన్నటువంటి మిజోరం రాష్ట్రంలో ఇప్పుడు కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించగలిగింది కాంగ్రెస్. అదే మిజోరం రాష్ట్రంలో గతంలో ఒక్క స్థానం మాత్రమే గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రెండు స్థానాలు గెలుచుకుంది.
గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈసారి ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ కి బదులుగా బిజెపి విజయం సాధించింది. అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ కి బదులుగా కాంగ్రెస్ గెలుపు సాధించింది. అయితే కొంతమంది మాత్రం కాంగ్రెస్ గెలుపు విషయంలో వెనుకబడింది అంటుంటే ఆ మాటని కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. అయితే ఈ ఐదు రాష్ట్రాల మొత్తం ఓట్ల లెక్కను చూస్తే కనుక తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని కాంగ్రెస్ చెప్తుంది.
4.92 కోట్లు ఓట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే 4.81 కోట్ల ఓట్లు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలుచుకుందని కాంగ్రెస్ చెప్తుంది. ఇంతకీ కాంగ్రెస్ అసలు లెక్క ఏంటంటే ఓట్ల శాతం మెరుగ్గా లేని తెలంగాణలోనూ, అదే విధంగా మిజోరం లోనూ బిజెపికి వచ్చిన ఓట్లను పోల్చుకొని కాంగ్రెస్ ఈ విధంగా అంటుందని అంటున్నారు రాజకీయ నిపుణులు.