ఏపీలో ఎన్నికలు ముగించుకొని సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా కలకలం రేగింది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ కు సమీపంగా వచ్చారని ఓ ఎన్నారైని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఎన్నారై డాక్టర్ ఉయ్యూరి లోకేశ్.


ఎయిర్ పోర్టులో వీఐపీ మూమెంట్స్ ఉన్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే కారణంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  ఈ విషయం బయటకి రావడంతో పోలీసులు స్పందించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై డాక్టర్ ఉయ్యూరి లోకేశ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అనారోగ్యంతో ఉందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. అయితే లోకేశ్ ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని.. వేధించారని చివరకు ఆయన అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రిలో చేర్పించారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.


ఈ నేపథ్యంలో ఆయన సడెన్ గా టీడీపీ కార్యాలయంలో ప్రతక్షమయ్యారు. ఆయనతో పాటు దేవినేని ఉమ, పార్టీ నాయకులు, న్యాయవాదులు ఉన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..  గన్నవరం ఎయిర్ పోర్టుకి వచ్చిన తనపై పోలీసులు అకారణంగా దాడి చేశారని ఉయ్యూరి లోకేశ్  తెలిపారు. జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకే వారు ఎయిర్ పోర్టులో తనను గుర్తు పట్టి అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత దాడి చేశారని ఆరోపించాడు. ఛాతీ నొప్పి వస్తుందని చెప్పినా తనపై అధికారులు, పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారన్నారు.


ఇప్పుడు ఆయన గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2016లోనే ఆయన మానసిక స్థితి బాలేదని తెలిసి అమెరికాలో డాక్టర్ లైసెన్స్ రద్దు చేశారు.  మానసిక సమతుల్యత కోల్పోయి బాధపడుతున్న అతడిని ఓ మేధావిగా టీడీపీ నాయకులు చిత్రీకరించారు. 1983లో గుంటూరు మెడికల్ కాలేజీలో డాక్టర్ పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలో కొన్ని సర్జరీలు చేసినప్పుడు ఫెయిల్ కావడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు అనే విషయం తాజాగా బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nri