అమరావతి ఫేజ్ టూ కి అదనపు భూములు అవసరం. అమరావతి లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ , స్పోర్ట్స్ సిటీ రాకపోతే ఇక్కడ పెరిగిన భూముల ధరల నిలబడవు.. ఇక్క‌డ భూముల విలువ పెరిగే అవ‌కాశం లేద‌ని మున్సిప‌ల్ శాఖా మంత్రి నారాయ‌ణ ప‌దే ప‌దే మీడియాకు చెపుతున్నారు. సీఎం చంద్ర‌బాబు వందేళ్ల గురించి ఆలోచిస్తున్నార‌ని ఓ సారి.. అలాగే 50 ఏళ్ల గురించి ఆలోచ‌న చేస్తున్నార‌ని మ‌రోసారి చెపుతూ వ‌స్తున్నారు. ఇక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం హైద‌రాబాద్‌లాంటి మ‌హాన‌గ‌రంలా అమ‌రావ‌తి అభివృద్ధి చెందాలంటే అద‌న‌పు భూసేక‌ర‌ణ అవ‌స‌రం అని చెపుతున్నారు. అద‌న‌పు భూసేక‌ర‌ణ వ‌ల్ల అమ‌రావ‌తిలో భూముల ధ‌ర‌లు ప‌డిపోతాయ‌న్న‌ది అపోహ అని చంద్ర‌బాబు రైతుల‌తో చెపుతున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ మాటలు ఇలా ఉంటే..కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన  మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం ఇందుకు రివ‌ర్స్‌లో మాట్లాడుతున్నారు. పీఎం మోడీ ప‌ర్య‌ట‌న విజ‌యంతం చేయాల‌ని ఆయ‌న సోమ‌వారం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం బేత‌పూడిలో ర‌చ్చ‌బండ నిర్వ‌హించారు. అక్క‌డ ఆయ‌న మాట్లాడుతూ అమరావతి లేకపోతే మనకు అడ్రస్ లేదు...రాజధాని ప్రాంతం అభివృద్ధి కోసం 33 వేల ఎకరాలు కాకుండా మరో 44 వేల ఎకరాలు సేకరిస్తున్నారనే ప్రచారం న‌డుస్తోంద‌న్న విష‌యం మా దృష్టికి వ‌చ్చింది.


ఈ అపోహ‌లు రైతులు మ‌ర్చిపోండి... కూటమి ప్రభుత్వం కొత్తగా భూ సమీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మా దృష్టంతా ప్రస్తుతం సేకరించిన 33 వేల ఎకరాల అభివృద్ధిపైనే ఉంద‌న్నారు. ఇలా కూట‌మిలో రెండు విరుద్ధ‌మైన ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌డంతో అస‌లు ఏంటి ఈ గంద‌ర‌గోళం అన్న చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. అస‌లు గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ 33 వేల ఎక‌రాల సేక‌ర‌ణే త‌ప్పుప‌ట్టారు.. ఇప్పుడు చంద్ర‌బాబు అద‌న‌పు భూసేక‌ర‌ణ చేయాల‌ని ప‌ట్టుబ‌డుతుండ‌డంతో ఈ సారి జ‌న‌సేన స్టాండ్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిగా ఉంది.
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..


ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: