
పాత్‌హోల్ ఫ్రీ పనుల కోసం రూ.100 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ బిల్లులను సీనియారిటీ ప్రాతిపదికన చెల్లించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే రూ.861 కోట్లతో 20 వేల కిలోమీటర్ల రహదారులను గుంతలు లేకుండా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ పనులు గతంలో రహదారుల నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యాన్ని సవరించే దిశగా కీలకమైనవని పేర్కొన్నారు. ప్రజలు గత ఐదేళ్లుగా గుంతలతో కూడిన రోడ్ల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేశారు.
రాష్ట్రంలో సీ కేటగిరీ కింద రూ.600 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. గతంలో నాణ్యత లేని రోడ్ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన నిర్మాణంపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తామని హామీ ఇచ్చారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు