ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు కంటికి క‌నిపించ‌ని క‌రోనా దెబ్బ‌కు విల‌విల‌లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారింది. నిన్న మొన్నటి వరకూ పెద్దవో చిన్నవో ఉద్యోగాలు చేసుకుంటూ సాగిన బతుకులు ఒక్కసారిగా కుదేలయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో పొట్టకూటి కోసం ఉన్నత విద్యావంతులైన యువత సైతం కూలీలుగా మారుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ప‌లు కంపెనీలు మాత్రం నిరుద్యోగుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తూ.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో  77 ఖాళీలు ఉన్నాయి. పలు విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టుల‌వి. ఇక ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 77 ఖాళీలు ఉండగా అందులో ప్రాజెక్ట్ ఇంజనీర్- 1, ఈసీఈ- 8, కంప్యూటర్ సైన్స్- 13, ట్రైనీ ఇంజనీర్- 5, ట్రైనీ ఇంజనీర్ 1- 20, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1- 30 పోస్టులన్నాయి.విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు పూర్తిచేసినవారు ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 2020 ఆగస్ట్ 2 చివరి తేదీగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేయాల‌నుకునే వారు రూ.200  ఫీజు చ‌ల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేయాల‌నుకునే రూ.500 ఫీజు చెల్లించాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://bel-india.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. ఘజియాబాద్‌‌లోని యూనిట్, నేవీ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో పాటు పలు ప్రాజెక్టుల్లో వీరిని నియమించనుంది. ద‌ర‌ఖాస్తుకు మ‌రో రెండు రోజులే గ‌డువు ఉంది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

మరింత సమాచారం తెలుసుకోండి: