తెలంగాణాలో రాష్ట్రం లో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కు మరోసారి తాత్కాలిక బ్రేక్‌ పడింది. మల్టీజోన్‌-2 బదిలీ లు, పదోన్నతుల పై తాజాగా హైకోర్టు స్టే విధించింది.. దీంతో ఈ జోన్‌ పరిధి లోని 13 జిల్లాల్లో బదిలీ లు నిలిచిపోయాయి. అయితే, మల్టీజోన్‌ 1 పరిధిలోని 20 జిల్లాల్లో ని టీచర్ల బదిలీలు మరియు పదోన్నతులు షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతాయి. ఇప్పటికే గెజిటెడ్‌ హెచ్‌ఎంల బదిలీలు ముగిశాయి. తాజాగా స్కూల్‌ అసిస్టెంట్ల కు గెజిటెడ్‌ హెచ్‌ఎంలు గా  పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ, తుది జాబితాలు మరియు జీహెచ్‌ఎం పోస్టుల ఖాళీల జాబితా ను విద్యాశాఖ అధికారులు బుధవారం విడుదల చేశారు.

 ఈ జాబితాల పై అభ్యంతరాలు తెలియజేసేందుకు గురువారం వరకు అయితే అవకాశం ఇచ్చారు.ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఈ 13 జిల్లాల్లో బదిలీలు, పదోన్నతుల పై స్టే విధించింది. రంగారెడ్డి జిల్లాలో ని కొందరు టీచర్లు మరియు సీనియార్టీ జాబితాల పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కోర్టుని ఆశ్రయించారు. దీనిపై బుధవారం హైకోర్టు లో విచారణ జరగ్గా, హైకోర్టు స్టే విధించింది . ఈ 13 జిల్లాల కు ఇతర జిల్లాల నుంచి కొంతమంది టీచర్లు వచ్చినందున సీనియార్టీ జాబితాలను రూపొందించాలని హైకోర్టు విద్యాశాఖను ఆదేశించింది.

ఈ కేసుపై అక్టోబర్‌ 10 వరకు హైకోర్ట్ స్టే విధించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు మల్టీజోన్‌ -1 లో బదిలీ లు, పదోన్నతు ల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు మల్టీజోన్‌ -2 పరిధి లోని 13 జిల్లాల్లో కొత్త సీనియార్టీ జాబితాల ను సిద్ధం చేసి, వీలైనంత త్వరగా, కోర్టు కు సమర్పించి స్టే ను వెకెట్‌ చేయిస్తామని వారు తెలిపడం జరిగింది.. ఈ ప్రక్రియ ను వారం లోపే ముగిస్తామని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: