విద్యార్థులు తిరిగి స్కూల్ కి వెళ్లే సమయం త్వరలో ఆసన్నం కానుంది. మరో నెల రోజుల్లో పిల్లలు తిరిగి స్కూల్ కి పయనం కావాల్సిందే.. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు ప్రారంభం అవుతాయి కానీ తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అసలు విషయంలోకి వెళ్తే.. జూన్ 12న ప్రభుత్వం స్కూళ్లను రీ ఓపెన్ చేయనుంది. ఆరోజునే పిల్లలకు కావలసిన పుస్తకాలు, యూనిఫామ్ అందించాలని కూడా నిర్ణయించుకుంది.

అయితే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి జూన్ 6 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని,తాజాగా ఉపాధ్యాయులను ఆదేశించింది.  ఇందులో మహిళా సంఘాలు,  స్కూల్ కమిటీలు, టీచర్లు, హెచ్ఎంలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొనేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అదే నెల 7వ తేదీన ప్రతి ఇంటిని సందర్శించి బడికి వెళ్లని పిల్లలను గుర్తించాలని కూడా ప్రభుత్వం తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే బడిబాట కార్యక్రమంలో అటు విద్యార్థులు కూడా పాల్గొనాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.  అందుకే ప్రతి ఒక్కరు కూడా జూన్ 12వ తేదీనే సాధ్యమైనంత వరకు పాఠశాలలకు వెళ్లాలి అని ఆదేశాలు జారీ చేసింది . ఇక ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ అంటూ వెకేషన్ ఎంజాయ్ చేసిన పిల్లలు మరో 10 నెలలపాటు తరగతి గదులకే అంకితం కాబోతున్నారు. ఇకపోతే పిల్లల అల్లరి చేష్టలు భరించలేని తల్లిదండ్రులు కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారని సరదాగా  నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక పిల్లల తరగతి గదులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందరూ అలర్ట్ కావాలని ప్రభుత్వం తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి: