
ధనియాలను కషాయం చేసుకుని అందులో చక్కెర కలుపుకుని తాగడం వల్ల దాహం ఎక్కువగా ఉన్న వాళ్లకి దాహం తీరుతుంది.ధనియాలను పొడి చేసుకొని రోజు సగం స్పూన్ తినడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది.
శ్వాస సరిగా ఆడక పోతే ధనియాలను పొడి చేసుకొని,దానికి చక్కెర కలిపి,ఈ రెండింటిని బియ్యం కడిగిన నీటితో తీసుకోవడం వల్ల శ్వాస సరిగ్గా ఆడుతుంది.
అజీర్తి గా ఉన్నప్పుడు ధనియాలు,శొంఠి కలిపి కషాయంగా తయారు చేసుకోవాలి ఈ కషాయం తాగడం వల్ల అజీర్తి తగ్గుతుంది.
నిద్రలేమితో బాధపడుతున్న వారు ధనియాలతో చేసిన కషాయంలో చక్కెర కలుపుకుని తాగితే నిద్ర సరిగా పడుతుంది.
జీర్ణశక్తి పెరగడానికి ధనియాలు,జిలకర్ర, మిర్చి కరివేపాకు,అన్నింటినీ కలిపి నెయ్యిలో వేయించి, ఉప్పు కలిపి పొడి చేసుకుని ఆ పొడిని భద్రపరచుకోవాలి.రోజు ఆ పొడిని అన్నంతో కలిపి తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
మూత్రంతో పాటు ఇంద్రియం పోతుంటే, ధనియాల కషాయంలో సమంగా తేనె కలుపుకొని తాగడం వల్ల ఇంద్రియం పోవడం తగ్గుతుంది.
తలనొప్పి బాధిస్తుంటే ధనియాలను మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకొని ఆ పేస్టును తల మీద అప్లై చేసుకోవడం వల్ల తలలో వేడి తగ్గి, తలనొప్పి తగ్గుతుంది.