కవలలు ఒకేసారి తల్లి గర్భాన్ని పంచుకుంటూ జంటగా పుట్టుకొచ్చే ప్రకృతి ప్రసాదితాలు. అమ్మానాన్నలకు రెట్టింపు ముద్దు మురిపాలను పంచే వరాలు.  మానవ ఆరోగ్యం, వ్యవహార శైలి గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి అనేక సందర్భాలలో పరిశోధకులు కలలపై ఆధారపడుతుంటారు. వారిలోని వైరుధ్యాలను పరిశీలించడం ద్వారా కొత్త విషయాలను వెలుగులోకి తెస్తుంటారు. వ్యాధులకు కారణమవుతున్న జన్యువులు,  పర్యావరణ అంశాలను గుర్తించే ప్రక్రియను ఇలాంటి పరిశోధనలు విస్తృతంగా చేశాయి.  తద్వారా కొత్త చికిత్స నివారణ చర్యలపై అవగాహన ఏర్పడుతుంది. ఇప్పటివరకు ఇలాంటి పరిశోధనలలో వెల్లడైన కీలక అంశాలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు విశ్లేషణ చేశారు.  

అయితే ఫలదీకరణం చెందిన ఒకే ఒక అండం. కొద్దిరోజుల తర్వాత విడిపోవడం వల్ల ఏక‌రూప క‌వ‌ల‌లు ఏర్ప‌డుతుంటారు. వీరిద్ద‌రి డీఎన్ఏ  దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. చాలా వరకు ఈజంట‌లో ఇద్ద‌రు ఆడ‌ లేదా మ‌గ శిశువులు ఉంటారు. రెండు అండాలు ఏక‌కాలంలో ఫ‌ల‌దీక‌ర‌ణం చెంద‌డం వ‌ల్ల సాధార‌ణ క‌వ‌లలు ఏర్ప‌డుతుంటారు.  వీరు జన్యుపరంగా భిన్నంగా ఉంటారు.  ఇలాంట ఒక క‌వ‌ల జంట‌లో ఒక్కోసారి ఆడ‌, మ‌గ ఇద్ద‌రూ ఉండ వ‌చ్చు.  తాము సాధారణ క‌వ‌ల‌ల‌మా.. లేక ఏకరూప కవలల‌మా అనే విషయము చాలామందికి తెలియదని 2012వ సంవత్సరంలో ఆస్ట్రేలియా లో నిర్వహించిన అధ్యయనంలో వైద్యులు వెల్లడించారు.  కొందరు  క‌వ‌ల‌ల‌కు వైద్యులే ఈ  విషయం పై  అస్ప‌ష్ట సమాచారం ఇచ్చినట్టు వెల్లడి  కావడం గమనార్హం.

వ్యాధులకు పర్యావరణ అంశాలకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తించడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ.  వ్యక్తుల మధ్య ఉండే వైరుధ్యాల వల్ల నిర్దిష్ట అంచనాకు రావడం కష్టం.  వాతావరణంలో పెరుగుతున్న విభిన్న అలవాట్లు కలిగిన కవల సోదరుల పై పరిశోధనల ద్వారా వీటిని అధిగమించవచ్చు. వీరిలో సాధారణంగా ఒకే రకం జన్యువులు ఉండడమే ఇందుకు కారణం. అందువల్ల వారిలో ఉన్న వైరుధ్యాలను ఆసరా చేసుకొని వ్యాధి కారకాలను నిర్దిష్టంగా గుర్తించవచ్చు. మ‌రోవైపు సిగ‌రేట్ కాల్చ‌డం ద్వారా కూడా క‌వ‌ల‌ల ఎముక దెబ్బ‌తిని ఆస్టియోపోరోసిస్‌ను క‌లిగించే స్థాయిలో క్షీణ‌త ఉన్న‌ద‌ని వెల్ల‌డి అయింది. ఏదీ ఏమైనా కానీ.. క‌వ‌ల‌లు మాత్రం కాస్త‌ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.  దూమ‌పానం, మ‌ద్య‌పానం చేయ‌క‌పోవ‌డం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: