అందరికీ అన్ని రంగాల్లో జనరల్ డ్యూటీలు ఉండేటువంటి ఉద్యోగాలు రావడం చాలా కష్టమని చెప్పవచ్చు. కొన్ని సంస్థలలో నైట్ డ్యూటీలు కూడా అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి. అయితే రాత్రి వేళల షిఫ్టుల్లో పనిచేసేవారు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను ఉపయోగించుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.


ముఖ్యంగా నిద్రపోవడానికి సమయాన్ని ప్రతి ఒక్కరూ సెట్ చేసుకోవాలి నిర్ణీత వ్యవధిలో నిద్ర పోవడం వలన బరువు పెరగడం, మానసిక ఒత్తిడికి లోనవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి రాత్రి సమయాల్లో డ్యూటీలు చేసేవారు ముందుగా నిద్రా సమయాన్ని ఫిక్స్ చేసుకుని రోజులు ఆ సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

రాత్రి సమయాలలో టి కాఫీ ఇతర కూల్డ్రింక్స్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి నిద్ర పట్టకూడదని ఉద్దేశంతో వీటిని తాగితే ఇవి మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపుతాయట.


ప్రతి ఒక్కరికి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వారి కుటుంబంతో సమయాన్ని గడపడం చాలా మంచి దీని వల్ల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.

ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి వాటికి కొంత సమయాన్ని కేటాయించడం వల్ల బద్ధకం సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

రాత్రి సమయాలలో పనిచేసేవారు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారని కొన్ని పరిశోధనలలో తెలియజేయడం జరిగింది. ఇలాంటి సమయాలలో అతిగా తినకూడదట తింటే ఉబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరానికి ఎక్కువగా కేలరీలు అందడం వల్ల మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అందుచేతనే మనం తీసుకునే ఆహారం పైన ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి.

ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా ధ్యానం వంటివి చేస్తే మంచి ఫలితం దక్కుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేయడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: