ప్రస్తుతం చాలా మంది కూడా ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం ఆల్కహాల్‌ తాగే వారికే ఈ ఫ్యాటీ లివర్‌ సమస్య ఎక్కువగా వచ్చేది. కానీ ప్రస్తుతం ఆల్కహాల్‌ అలవాటు లేని వారిలో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా వస్తుంది.మితిమీరిన మాంసం తినడం, అనారోగ్యకరమైన జీవన విధానం, తీసుకునే ఆహారం నాణ్యతలేని కారణంగా ఫ్యాటీ లివర్‌ సమస్య బారినపడుతోన్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే ఫ్యాటీ లివర్‌ సమస్యను ముందుగానే గుర్తిస్తే ఖచ్చితంగా దానికి తగిన చికిత్స తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఆల్కహాల్‌ అధికంగా తాగడం వల్ల కాలేయం ఆల్కహాల్‌ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇది శరీరం నుంచి దాన్ని తొలగించలేదు. దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ హానికరమైన పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. దీంతో కాలేయ వాపు సంభవిస్తుంది.ఇక ఫ్యాటీ లివర్‌ వచ్చే వారిలో అతిసారం సమస్య వేధిస్తుంటుంది.


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వ్యాధి పేగు కదలికలను పాడు చేస్తుంది. సిర్రోసిస్‌లో చిన్న పేగు పనితీరు ఆటంకం ఏర్పడటం వల్ల బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది అతిసారం సమస్యకు దారి తీస్తుంది.మిమ్మల్ని నిత్యం అలసట, నీరసం వేధిస్తుంటే ఫ్యాటీ లివర్‌ సమస్య కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య దీర్ఘకాలంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.ఫ్యాటీ లివర్‌ సమస్యలో ఉన్న వారు ఆకలి కోల్పోతారు. కాలేయ వ్యాధిలో గ్రెలిన్ స్థాయిలు భోజనం చేసే ముందు పెరగడంలో విఫలమవుతాయి. దాని వల్ల ఆకలిగా అనిపించదు.ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడే వారిలో పొత్తి కడుపు నొప్పి ఉంటుంది. దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. కడుపునొప్పితో పాటు వికారం కూడా ఉంటే ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నట్లేనని గుర్తించాలి. కాబట్టి ఈ లక్షణాలు తెలుసుకొని వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: