ఎవరైతే ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించకపోతారో.. తప్పకుండా వారి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే చాలామంది అధిక బరువుతో బాధపడటమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగించలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పని ఒత్తిడి.. జీవనశైలిలో మార్పులు, ఉద్యోగం చేసేవారైతే సమయం లేక సరైన సమయానికి ఆహారం తీసుకోలేక పోతున్నారు. పైగా చిరుతిళ్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. సరైన సమయానికి తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం, లాంటి పనులు వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండెపోటు , మధుమేహం వంటి సమస్యలతో అధికంగా బాధపడుతున్నారు.

మరి శరీరంలో పేరుకుపోయిన ఈ చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి ఏం చేయాలి అనే విషయానికి వస్తే.. మీరు రోజు వారి ఆహారంలో కనీసం గుప్పెడు వాల్ నట్స్, బాదం పప్పు, పిస్తా పప్పులను చేర్చుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ దూరం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారు ఒక గుప్పెడు బాదం పప్పులను రోజు తినడం వలన శరీరం ఆరోగ్యంగా,  ఫిట్ గా  ఉంటుంది. బాదం పప్పు లో అమినో యాసిడ్స్ ఉండటం వల్ల ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ను  ఉత్పత్తి చేస్తాయి. ఇక ప్రతిరోజూ గుప్పెడు పిస్తా పప్పులను తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ దూరం చేస్తాయి.

ఇక వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తోపాటు మోనో  సాచ్యురేటెడ్ కొవ్వులు ఉండడంవల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ దూరం చేయాలి అంటే అవిసె గింజలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. ప్రతి రోజు మీ ఆహారంలో డ్రై ఫ్రూట్ ఉండేలా చూసుకుంటే చెడు కొలెస్ట్రాల్ దూరం అవ్వడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: