పూర్వం గుండె జబ్బులు వయసు మళ్లిన తర్వాత, జీవక్రియ రేటు తగ్గడం వల్ల వచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో 30,35 సంవత్సరాల వయసులో వున్న యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దీనికి కారణం మన శరీరంలో పేరుకుపోయిన LDL అనే కొలెస్ట్రాల్ అధికమవడం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ldl కొలెస్ట్రాల్ మనకు అధికంగా మనం వాడే వంట నూనెల్లోను, మాంసాహారాల్లో, జంక్ ఫూడ్ లో లభిస్తుంది.ఈ పదార్థాలను లేకుండా రోజు గడవదు అన్నట్టు, యువత వాటినే ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనితో పాటు శారీరకశ్రమ లేకపోవడం, ఒకే చోట కూర్చొని పని చేయాల్సి రావడం, సరైనా వ్యాయామం చేయకపోవడం వల్ల,చెడు కొలెస్ట్రాల్ గుండె చుట్టు పేరుకుపోయి, గుండె జబ్బులు తొందరగా రావడానికి దోహదం చేస్తున్నాయి. ఈ గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి మన వంటింట్లో వాడే కొన్ని పదార్థాల ద్వారా తగ్గించుకోవచ్చని ఆహారానిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

వెల్లుల్లి..
పచ్చి వెల్లుల్లి రోజూ తీసుకోవడం వల్ల, ఇందులోని అలిసిన్ అనే పదార్థము, నోట్లోని లాలజాలంతో కలిసి అలినిన్ గా మారి, లివర్ లోకీ వెళ్ళి ldl కొలెస్ట్రాల్ తయారవకుండా అడ్డుకుంటుంది. దీనితో గుండె జబ్బులు రాకుండా,మన గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు.

 పసుపు..
మనం వంటల్లో రోజు వాడే పసుపులో కరక్యూమిన్ అనే  సమ్మేళనం ఉండడం వల్ల, రక్తనాళాల్లో పేరుకుపోయే ldl కొలెస్ట్రాల్ ని కరిగించి,రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

దాల్చినచెక్క..
 దాల్చినచెక్కను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల, ఇందులోని పాలిఫినాల్స్, సినానోసిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ldl కొలెస్ట్రాలను కరిగించి రక్తనాళాలపై కలిగే ఒత్తిడి తగ్గిస్తాయి. దీనితో గుండెకు రక్తసరఫరా సక్రమంగా జరిగి, గుండెజబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.

 కావున ప్రతి ఒక్కరూ వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.వీటితో పాటు, సరైన శారీరక శ్రమ,  సరైన ఆహార అలవాట్లు,తగిన వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: