ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి చిన్న పనికి ప్రతి ఒక్కరూ నీరసించి పోతున్నారు. అంతేకాదు వారికి ఏ పని చేయాలన్నా తగినంత శక్తి లేకపోవడం, ముఖ్యంగా బద్ధకంగా అనిపించడం లాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. మరొకవైపు వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే వైరల్ ఫీవర్స్ తో వణికిపోతున్నారు ప్రజలు. మరి ఈ వైరల్ ఫీవర్స్ వల్ల వచ్చే నీరసం అంతా ఇంత కాదని చెప్పాలి. ఒకవేళ జ్వరం వచ్చి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా నీరసం అనేది పట్టిపీడిస్తూనే ఉంటుంది. దీంతో ఆ నీరసాన్ని ఎలా వధించుకోవాలో అర్థం కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ కనుక మీరు తాగినట్లయితే ఎలాంటి నీరసాన్ని అయినా సరే తరిమికొట్టవచ్చు.

ఇకపోతే ఈ డ్రింక్ కోసం మీరు ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్.. వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి.  తర్వాత బ్లెండర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలు,  నానపెట్టుకున్న చియా సీడ్స్ , ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్, నాలుగు నానపెట్టి పొట్టు తొలగించుకున్న బాదం పప్పులు, నాలుగు పిస్తా పలుకులు ,నాలుగు గింజలు తొలగించిన ఖర్జూరాలు, అరకప్పు అరటిపండు ముక్కలు, ఒక అవకాడో పల్ప్, ఒక గ్లాస్ వాటర్, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి నాలుగైదు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి .ఇక ఈ ప్రోటీన్ డ్రింక్ ను మీరు ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున వారం రోజులపాటు తీసుకున్నట్లయితే నీరసం మొత్తం ఇట్టే ఎగిరిపోతుంది.

ఇక మీరు ఎనర్జీగా ఉండటమే కాకుండా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ డ్రింక్ చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. అతి ఆకలి దూరం అవుతుంది. మెటబాలిజం రేటు పెరిగి మీ శరీరంలో అధికంగా ఉన్న క్యాలరీలు కూడా తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: