సపోటా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి.ఈ సపోటా తినడానికి చాలా రుచికరంగా ఉండటం వలన దీనిని మిల్క్ షేక్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ పండు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సపోటాలో కాపర్, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం ఇంకా అలాగే నియాసిస్ వంటి ఖనిజాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇవి చాలా రోగాలను నయం చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సపోటా చాలా మంచి పాత్ర పోషిస్తుంది. దీనిలోని క్యాల్షియం ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది.ఇంకా జుట్టుకు కూడా సపోటా తగిన పోషణను అందిస్తుంది. ఇంకా అంతే కాకుండా దీనిని తరచుగా తింటే చుండ్రు సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఈ సపోటాలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది.చెడు కొలెస్ట్రాల్‌ను ఇది ఈజీగా తగ్గిస్తుంది. ఇంకా అలాగే సన్ బర్న్స్ నుండి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. సపోటాలో ఉండే కాపర్ ఇంకా ఫాస్ఫరస్ మీ చర్మానికి రక్షణ కల్పిస్తుంది.


ఈ సపోటా శరీరంలో ఉన్న హార్మోన్లను బ్యాలెన్స్ చేసి, అడ్రినల్ గ్రంధులు చురుగ్గా ఉండేలా చేస్తుంది.సపోటా పండులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి చాలా బాగా పని చేస్తుంది.కాల్షియంతో పాటు మెగ్నిషియం, పొటాషియం, జింక్‌, కాపర్‌, పాస్పరస్‌ ఇంకా సెలినియం వంటి మినరల్స్‌ కూడా సపోటాలో చాలా ఎక్కువగా ఉంటాయి.అలాగే రోజుకు కనీసం రెండు, మూడు సపోటా పండ్లు తింటే పిల్లలకు ఇంకా పెద్దలకు చాలా పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళేవారిలో అలాగే టెన్షన్ వర్క్స్ చేసేవారు సపోటాను తింటే అలసట వెంటనే తగ్గి కొత్త ఉత్సాహం  వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.అలాగే ఈ సపోటాలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో రోగనిరోధక శక్తి మెరుగుదలకు ఉపయోగపడే ఎ, బి ఇంకా సి విటమిన్లు కూడా ఉంటాయి.ఈ సపోటా పండ్లను ఎక్కువగా తింటే దృష్టి లోపాలు కూడా ఈజీగా దూరమవుతాయి. రోజూ ఒక పండు చొప్పున తింటూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఊపిరితిత్తులకు కూడా చాలా రకాలుగా మేలు జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: