ఆవకాయ అనగానే ముందుగా మనకు గుర్తు వచ్చేది మామిడికాయతో చేసిన నిల్వ పచ్చడి.సంవత్సరం మొతం నిల్వ ఉండే పచ్చడి.ఈ మామిడికాయ పచ్చడే కాకుండా ఇంకా పలు రకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. గోంగూర పచ్చడి, ఉసిరికాయ పచ్చడి.పండుమిర్చి పచ్చడి, టమాటా పచ్చడి.వెల్లులి పచ్చడి, అల్లం పచ్చడి, చింతకాయ పచ్చడి,ఇలా చాలా రకాల నిల్వ పచ్చళ్ళు మనం చూస్తూనే ఉన్నాం.అయితే పచ్చిమిరపకాయతో ఆవకాయ పచ్చడి ఎప్పుడైనా టేస్ట్ చేశారా?అన్ని సీజెన్స్ లో లభించే ఈ పచ్చిమిరపకాయలతో మనం రెండు మూడు నెలలు నిల్వ ఉండే పచ్చడి పెట్టుకోవచ్చు.సదారణంగా పచ్చిమిర్చితో రోటి పచ్చలు,కూరలలో పప్పులలో తరచూ వాడతారు. మిరపకాయ బజ్జీలు, సమోసాలలో ఈ పచ్చిమిర్చిని డీప్ ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు.రుచి అదిరిపోతుంది.నిన్వెజ్ లో అయితే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చిమిర్చి కూడా కంపల్సరీ.ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఈ పచ్చిమిరపకాయతో చేసిన చట్నీ లేకుంటే అసలు నడవదు.మరి ఈ పచ్చిమిర్చికి అంత డిమాండ్ ఉంది.అలాంటి ఈ పచ్చిమిర్చితో మరి ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా.ఈ పచ్చడికి బజ్జీ మిరపకాయలు అయితే ఇంకా బాగుంటుంది.


ముందుగా ఒక హాఫ్ కేజీ బజ్జీ మిరపకాయలు తీసుకుని తొడెము ఫుల్ గా తీసివేయకుండా సగగానికి కట్ చేసి కాయలన్నీ శుభ్రంగా కడిగి తేమ లేకుండ ఒక క్లాత్ తో నీట్ గా తుడిచి పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఈ మిరపకాయలకి చాకుతో చుట్టూ మూడు గాట్లు పెట్టుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి.ఇప్పుడు ఒక పాన్ లో ఐదు స్పూన్ ల ఆవాలు మూడు స్పూన్ ల మెంతులు వేసి దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు గాట్లు పెట్టుకున్న మిరపకాయలలోకి యాభై గ్రాములు కారం,పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపొడి,పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు,రుచికి సరిపడా కల్లు ఉప్పు వేసి, అందులోనే మూడువందల గ్రాముల నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.ఇలా అన్ని కలుపుకున్న తర్వాత చివరిగా ఏడు లేదా ఎనిమిది నిమ్మకాయల రాసాన్ని కలుపుకోవాలి.పులుపు ఎక్కువ తినే వారు ఇంకో రెండు నిమ్మకాయల రాసాన్ని యాడ్ చేసుకోవచ్చు.ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు.ఒక ఐదు రోజులు తర్వాత మిరపకాయ బాగా ఊరి పచ్చడి మంచి రుచిగా తయారావుతుంది.ఇంకెందుకు మరి లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చుడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: