
సబ్జా నిమ్మరసం కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ డ్రింక్ రోజు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సబ్జా గింజలు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. అలాగే నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రెండిటినీ కలిపి తాగితే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎలాంటి వ్యాయామాలు లేకుండా బరువు తగ్గాలనుకున్నవారు రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే నెలలోని మంచి ఫలితాలు పొందుతారు. బీట్రూట్లో తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి. కాబట్టి ప్రతిరోజు అర గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి.
ఇలా తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీట్రూట్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఇంకా మంచిది. నిమ్మరసంలో నానబెట్టిన చియా సీడ్స్ కలిపి తాగితే త్వరగా బరువు తగ్గడానికి వీలవుతుంది. చియా సీడ్స్ లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈజీగా బరువు తగ్గొచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ ను నిమ్మరసంలో విక్స్ చేసుకుని తాగితే సులువుగా బరువు తగ్గొచ్చు. నిమ్మరసంలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. నిమ్మరసంలో దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు. నిమ్మరసం దాల్చిన చెక్క కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది.