బరువు తగ్గడం అనేది ఇప్పుడు చాలా మందికి ముఖ్యమైన లక్ష్యం. దీనికోసం డైట్‌లు, వ్యాయామాలు, సప్లిమెంట్లు, మందులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆరోగ్యానికి ఎలాంటి నష్టము లేకుండా, సహజమైన మార్గంలో బరువు తగ్గాలంటే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిలో కొన్ని సహజ పదార్థాలను కలిపి తాగడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఉదయం వేడి నీటిలో కలిపి తాగదగిన చక్కటి పదార్థాలు – బరువు తగ్గించే సహజ మార్గాలు,  నిమ్మరసం + తేనె, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర నిమ్మరసం మరియు ఒక టీ స్పూన్ తేనె కలపాలి. శరీర డిటాక్సిఫికేషన్, జీర్ణ వ్యవస్థకు ఉత్తేజనం, కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

 జీలకర్ర నీళ్లు, ఒక టీస్పూన్ జీలకర్రని రాత్రి నుండి నీటిలో నానబెట్టాలి. ఉదయం వేడి చేసి, వడకట్టి తాగాలి. మలబద్ధకం నివారణ, బొజ్జ కరుగుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, మెంతుల నీళ్లు, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. కొవ్వు మెల్లగా కరుగుతుంది. హార్మోన్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుంది. అల్లం నీళ్లు,  కొన్ని అల్లం ముక్కలను నీటిలో మరిగించి వేడి వేడి గా తాగాలి. శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. మెటబాలిజం పెంచి కేలరీలు ఖర్చవుతాయి. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కర్పూరవల్లి ఆకులు / తులసి ఆకులతో నీరు, 4–5 ఆకులను మరిగించి తాగడం. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది.

మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఉదయాన్నే వేడి నీటితో శరీరంలోని డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. బాడీ ఫ్యాట్‌ను తక్కువ శ్రమతో కరిగించగలుగుతారు. వేడి నీరు బాడీలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపుతుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది. ఉదయాన్నే వేడి నీరు తాగితే మలవిసర్జన సజావుగా జరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి ముఖ్యం. వేడి నీరు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతగా తినకపోవటంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: