కాలంతో పాటు జనాలు కూడా మారిపోతున్నారు.  అన్ని విషయాలలో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది.  మరీ ముఖ్యంగా ఒకప్పుడు బట్టలు ఏ పండగకి లేదా పుట్టిన రోజు కి కొనుక్కునేవాళ్ళు . కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు చేతిలో డబ్బులు ఉన్న ..శాలరీ క్రెడిట్ అయిన.. పుట్టినరోజు ఫంక్షన్ ఉన్న.. ఆఫర్స్ ఎక్కువగా కనిపించిన .. కారణం లేకపోయినా సరే బట్టలు కొనుక్కునేస్తూనే ఉంటారు.  మరీ ముఖ్యంగా ఫారిన్ కల్చర్ ని ఎక్కువగా అలవాటు చేసుకునేస్తున్నారు జనాభా . అంతేకాదు ఒక మనిషికి ఒక జత చెప్పులు ఉంటేనే పెద్ద ఆశ్చర్యకరంగా చూసే రోజుల నుండి ఒక మనిషికి 10 రకాల చెప్పులు ఇంట్లో పెట్టుకునే స్థాయికి మారిపోయింది ప్రజెంట్ జనరేషన్ .


కాలంతోపాటు అన్ని విషయాలలో మార్పులు చేస్తుంది నేటి జనరేషన్ . మరీ ముఖ్యంగా చెప్పులు కూడా అందులో ఒక భాగం అయిపోయింది . గతంలో చెప్పులు ఎక్కువగా ధరించేవారు కాదు అన్న విషయం అందరికీ తెలుసు . అయితే ఈ రోజుల్లో మాత్రం ఇంట్లో తిరగడానికి ఒక చెప్పులు.. బాత్రూంకి వాడడానికి మరొక చెప్పులు .. బయటకు వెళ్లడానికి ఇంకో చెప్పులు .. జాగింగ్ కి ఒక రకమైన షూస్ ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలి అంటే మరొక రకమైన షూస్ .. ఇలా ఒక మనిషికి పది జతల చెప్పులు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో క్రాక్స్ అనేటివి ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి .



రోడ్లపై ,మాల్స్ లో , స్విమ్మింగ్ పూల్స్ లో క్రాక్స్ ధరించిన వారిని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంతెందుకు మన ఇంట్లో కూడా మన పిల్లలకి  మనం రకరకాల క్రాక్స్ వాడుతూనే ఉంటాం . అయితే ఈ క్రాక్స్ పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  క్రాక్స్ ప్రత్యేకమైన డిజైన్ సౌకర్యంగా ఉన్న పెద్దలు పిల్లలు వాటిని ధరించిన కారణంగా కొన్ని రకాల ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల విషయంలో అది మరీ మరీ డేంజర్ అంటూ కొంతమంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు .



పిల్లల పాదాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు వారికి సరైన మద్దతు చాలా చాలా అవసరం . క్రాక్స్ ధరించడం ద్వారా అది సాధ్యం కాదు అంటున్నారు డాక్టర్లు . ఇవి పాదాల వంపు భాగాన్ని సమర్థించేవి కాదు అని.. ఆ కారణంగా పిల్లల్లో పాదాలు హార్డ్ అయిపోతాయి అని లేదా పాదాల నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి అని హెచ్చరిస్తున్నారు . క్రాక్స్ ప్రత్యేక డిజైన్ వదులుగా తెరిచినట్లుగా ఉండటం వల్ల పిల్లలు ఆడటానికి.. పరిగెత్తడానికి ..లేదా దూకడానికి ప్రయత్నించేటప్పుడు అవి కొన్నిసార్లు స్లిప్ అయి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ హెచ్చరిస్తున్నారు.  దాని ద్వారా పెద్ద ప్రమాదాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు.



వీరికి శారీరక కార్యకలాపాలకు ఎక్కువగా క్రాక్స్  ఉపయోగించకపోవడమే మంచిది అంటూ సూచిస్తున్నారు . మరీ ముఖ్యంగా క్రాక్స్ రబ్బరు పదార్థం వల్ల మృదువుగా ఉండకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. సరైన కుషనింగ్ లేదా పొత్తికడల లేని రబ్బరు వల్ల పిల్లలు వీటిని గంటలు తరబడి ధరించిన వారి  పాదాలు అలసిపోయి నొప్పిగా మారుచు అంటూ హెచ్చరిస్తున్నారు . ఇలా క్రాక్స్ ఒక పాదరక్షక సౌకర్యవంతమైనదిగా కనిపించినప్పటికీ పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు అని పిల్లలకు మంచి గ్రిప్ సపోర్టు ఉన్న చెప్పులను  ధరించడం వల్ల వారి పాదాలు సరిగ్గా అభివృద్ధి చెందుతాయి అని వారు గాయపడకుండా ఆటలు ఆడగలుగుతారని సజెస్ట్ చేస్తున్నారు..!!



గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఇంటర్నెట్లో పొందుపరిచిన విషయాల ద్వారా సేకరించబడినది . దీనిని ఇండియా హెరాల్డ్ ఏ విధంగా ధృవీకరించడం లేదు . ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం మరీ మరీ ఉత్తమం అనే విషయం పాఠకులకు గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: