
పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, ఆకుకూరలు వంటి వాటిని ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, యోగా లేదా సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, బరువును అదుపులో ఉంచుతుంది. అధిక బరువు ఉన్నవారికి రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ద్వారా బరువు తగ్గితే బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది.
ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రక్తపోటు పెరుగుతుంది. ధ్యానం, శ్వాస వ్యాయామాలు, పుస్తకాలు చదవడం లేదా మీకు ఇష్టమైన పని చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మద్యం, సిగరెట్లు తాగడం వల్ల రక్తపోటు చాలా వేగంగా పెరుగుతుంది. వీటిని మానేయడం వల్ల బీపీని నియంత్రించవచ్చు. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి, వారు సూచించిన మందులను వాడటం ముఖ్యం అని చెప్పవచ్చు.
రక్తపోటు సమస్య వల్ల దీర్ఘకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఉప్పు, కారం పరిమితంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారిన పడే అవకాశం తగ్గుతుంది. కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ప్రాణాలను రక్షించుకోవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు