మనలో చాలా మంది రోజువారీ జీవితంలో చిన్నపాటి పొరపాట్లు చేస్తూ ఉంటాము, కాని కొన్ని విషయంలో మనకు తెలియకుండానే అవి పెద్ద సమస్యలు గా ఎదురవుతాయి. అలాంటివి ఒకటి – శనివారం పూట కొన్ని వస్తువులు కొనకూడదు అన్న ఆచారం.కొంత మంది పండితుల ప్రకారం, శనివారం పూట కొన్ని వస్తువులను కొనడం ద్వారా శని దేవుడికి ఆగ్రహం వస్తుంది, ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ విబేధాలు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఆ కారణం గానే ఎత్తి పరిస్ధితిలోనూ శనివారం కొన్ని వస్తువులు కొనుకోకూడదు.


శనివారం పూట కొనకూడని ఐదు వస్తువులు ఇవే..!


నూనె: చాలామందికి ఇది తెలుసు కానీ కొన్నిసార్లు పొరపాటు చేస్తూ ఉంటారు. శనివారం నూనె కొనడం వల్ల కుటుంబ పెద్దుల ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. పండితుల చెప్పడం ప్రకారం, ఈ రోజు నూనె కొనకూడదు. కొంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

చీపుర: శనివారం చీపుర కొనడం ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది అంటూ చెపుతున్నారు పండితులు. ఇంకా, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. పండితుల ప్రకారం, చీపురను శుక్రవారం కొనడం ఎక్కువ శుభంగా ఉంటుంది. ఎట్టి పరిస్ధితిలోనూ చీపుర శనివారం కొనకూడదట.

ఇనుప వస్తువులు: చాలా మందికి శనివారం హాలీడే ఉంటుంది. ఆ రోజే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుకుంటారు. ఇక ఇనుముతో తయారు చేసిన ఏ వస్తువైనా – వాహనానికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన – వస్తువులు శనివారం కొనకూడదు. ఇలా చేసుకుంటే ఆ పని సక్రమంగా ముందుకు వెళ్లదు అని పండితులు చెప్పుతున్నారు.

ఉప్పు: శనివారం ఉప్పు కొనడం వల్ల ఇంట్లో భార్యాభర్తల అనుబంధం దెబ్బతింటుందట. వారి మధ్య సమస్యలు వస్తాయట.  మరియు ఆర్థిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. ఆ కారణం గానే ఉప్పు శనివారం అస్సలు కొనకూడదు అంటున్నారు పండితులు.

చెప్పులు: శనివారం చెప్పులు కొనడం సరైనది కాదు. పండితుల ప్రకారం, ఇలా చేస్తే ఇంట్లో సంతోషం తగ్గి, దుఃఖం, పేదరికం వస్తాయట. తెలిసి కొన్న తెలియక కొన్న ఈ సమస్యలు తప్పవు. అందుకే పొరపాటున కూడా శనివారం చెప్పులు కొనకండి అంటున్నారు పండితులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: