ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గం..ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే ముందు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి..ఎందుకంటే జగిత్యాలలో ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈయనే...తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి..1983లో తొలిసారి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు..అలాగే ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే తర్వాత ఎన్టీఆర్‌తో విభేదించి జీవన్ రెడ్డి..కాంగ్రెస్‌లోకి వచ్చేశారు.

ఈ క్రమంలోనే 1985లో ఆయన ఓటమి పాలయ్యారు...ఇక 1989 ఎన్నికల్లో మళ్ళీ జగిత్యాలలో సత్తా చాటారు. ఇక 1994 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎల్ రమణ చేతిలో ఓడిపోయారు..తర్వాత రమణ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో 1996లో జగిత్యాలకు ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇక 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచేశారు..అలాగే వైఎస్సార్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

2009లో ఓటమి పాలవ్వగా, 2014 ఎన్నికల్లో మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఆరు సార్లు గెలిచారు...కానీ గత ఎన్నికల్లో ఓటమి ఎదురైంది..2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ చేతుల్లో ఓడిపోయారు. ఓడిపోయిన సరే తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి గెలిచారు.

అయితే వచ్చే ఎన్నికల్లో జగిత్యాలలో పోటీ చేయడానికి జీవన్ రెడ్డి రెడీ అవుతున్నారు...ఈ సారి ఎలాగైనా సంజయ్‌కు చెక్ పెట్టాలని అనుకుంటున్నారు..గత ఎన్నికల్లో కవిత సపోర్ట్‌తో సంజయ్ జగిత్యాలలో సత్తా చాటారు తప్ప..అక్కడ జీవన్‌కు ఉన్న ఫాలోయింగ్‌తో పోలిస్తే సంజయ్‌కు చాలా తక్కువ ఉంది..పైగా ఇప్పుడు సంజయ్‌పై వ్యతిరేకత కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది..ఈ పరిణామాలని బట్టి చూస్తే నెక్స్ట్ జగిత్యాలలో జీవన్ రెడ్డి సత్తా చాటేలా ఉన్నారు..కాకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అంత ఊపు కనిపించడం లేదు...ఒకవేళ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకుంటే జగిత్యాలలో జీవన్ రెడ్డికి తిరుగుండదనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: