నటసింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లో హీరోగా అరంగేట్రం చేస్తారని గత కొన్ని నెలలుగా అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బాలకృష్ణ తన కుమారుడిని వెండితెరపై హీరో గా చూడాలని బాగా ఆకాంక్షిస్తున్నట్లు సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కానీ మోక్షజ్ఞ మాత్రం కేవలం వ్యాపారాల బాధ్యతలు మాత్రమే వ్యవహరిస్తానని... హీరోగా నటించడానికి ఇష్టపడట్లేదని లేదని సన్నిహిత వర్గాల నుండి సమాచారం. కానీ బాలకృష్ణ కోరిక మేరకు ఒకసారి సినిమా రంగంలో అరంగేట్రం చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు మోక్షజ్ఞ.


అందుకే 4 నెలల క్రితం విదేశాలకు వెళ్లి హీరోకి కావలసిన దృఢమైన బాడి పొందేందుకు వ్యాయామ కసరత్తులు చేస్తున్నారు మోక్షజ్ఞ. గతంలో నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఆ ఫోటోలో మోక్షజ్ఞ కాస్త బొద్దుగా కనిపించడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ ఎప్పుడైతే నందమూరి మోక్షజ్ఞ సిక్స్ ప్యాక్ బాడీ పెంచడానికి విదేశాలకు వెళ్లారని తెలుసుకున్నారో ఆ క్షణమే అభిమానులు సంతోష పడటం ప్రారంభించారు. ఐతే చాలా నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు మోక్షజ్ఞ కు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. గతంలో వైరల్ అయిన ఫోటోని ఇప్పటి ఫోటోని పోల్చుతూ 'మోక్షజ్ఞ లావు తగ్గారు' అంటూ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాస్త సన్నగా అయినప్పటికీ మోక్షజ్ఞ హీరో అవ్వాలంటే ఇంకా చాలా కష్టపడాల్సి ఉందని తెలుస్తుంది.


ఇప్పటికే తన కుమారుడు మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ ఇద్దరు రచయితలతో కలిసి ఆదిత్య369 సీక్వెల్ అయిన ఆదిత్య 999 సినిమాకి కథ రాస్తున్నారు. మరి తండ్రి రాసిన సినిమా కథలో కుమారుడు మోక్షజ్ఞ ఎలా నటించనున్నారో... వెండితెరపై ఎలా అలరించనున్నారో తెలియాలంటే కొద్ది నెలల పాటు ఓపిక పట్టాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: