కొన్ని సినిమాల్లో ఒక్కోసారి వేరే హీరోలతో వాయిస్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాలోని కథను ముందుకు నడపాలన్న, చూసే ప్రేక్షకులకు సినిమా అర్ధం కావాలన్నా గాని వేరే హీరో వాయిస్ ని ఆ సినిమాలో పెట్టాలిసి వస్తుంది.  చాలా సినిమాల్లో వాయిస్ ఓవర్ ఆ హీరోనే ఇచ్చుకుంటాడు.  కానీ కొన్ని సినిమాల్లో మాత్రం వేరొక హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక హీరో చేసిన సినిమాకి మరొక  హీరో వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోల గూర్చి, సినిమాల గురించి తెలుసుకుందాం.  ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి దాదాపు మూడు సినిమాల వరకు వేరే హీరోలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ సినిమాల విషయానికి వస్తే  అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చాడు,అలాగే దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజీ సినిమాకి, మంచు మనోజ్ హీరోగా నటించిన గుంటూరోడు సినిమా కి మెగాస్టార్  వాయిస్ ఓవర్ ఇచ్చారు.

అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది.అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాకి,తన సోదరి మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాకి మహేష్ తన వాయిస్ ను అరువు ఇచ్చాడు. అలాగే నాగార్జున కూడా తన కొడుకులు నటించిన సినిమాలకు తన వాయిస్ ని ఇచ్చారు. నాగ చైతన్య నటించిన   ప్రేమమ్ సినిమాకి,  అఖిల్ నటించిన హలో సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.అలాగే జూనియర్  ఎన్టీఆర్ కూడా ఒక యంగ్ హీరోకి వాయిస్ ఓవర్ చేసాడు.  రామ్ హీరోగా వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా నితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమాకి,మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే  నాగ శౌర్య హీరోగా నటించిన అబ్బాయితో అమ్మాయి, లక్ష్మీ రావే మా ఇంటికి  సినిమాలకి  రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే  సాయి ధరమ్ తేజ్ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ సినిమాకి  రామ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఇంకా మన సునీల్ అయితే  రవిబాబు  నువ్విలా సినిమాకి, రేసుగుర్రం సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. రవితేజ కూడా  సైకిల్ పాత్రలో సునీల్ కిమర్యాద రామన్న సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాగే మంచు విష్ణు హీరోగా నటించిన దూసుకెళ్తా సినిమాకి కూడా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే అల్లరి నరేష్, సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.ఇలా మన హీరోలు మరొక హీరోల సినిమాలలో తమ వాయిస్ ని ఇచ్చారు.. !! ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చిన దాదాపు అన్నీ సినిమాలు మంచి హిట్ అయ్యాయి.. !

మరింత సమాచారం తెలుసుకోండి: