టాలీవుడ్ హీరో శర్వానంద్ ఈమధ్య కాలంలో వరుసగా ఎన్నో ప్లాపులు ఎదుర్కున్నాడు. ఇండస్ట్రీ లో చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్న కాని స్టార్ హీరో అవ్వలేకపోతున్నాడు. శర్వానంద్ తరువాత వచ్చిన  హీరోస్ అందరూ కూడా ఇప్పుడు మంచి మంచి హిట్లు కొడుతూ పెద్ద స్టార్స్ అవుతుంటే శర్వానంద్ మాత్రం ఇంకా అలాగే వుండిపోయాడు. గత పదేళ్ల నుంచి ఎన్నో సినిమాలు చేసిన ఈ హీరో కేవలం మూడు హిట్లతోనే సరిపెట్టుకున్నాడు. ఇక ఎన్నో ప్లాపుల తరువాత ఇప్పుడు 'శ్రీకారం' వంటి సబదేశాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ప్రియాంకా అరుళ్ మోహన్ శర్వానంద్ కి జంటగా నటించింది. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.



ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉన్నప్పటికీ.. టికెట్ రేట్లు పెంచెయ్యడం వలన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు. మొదటి రోజు పర్వాలేదు అనిపించినప్పటికీ తరువాత నుండీ బాగా తగ్గిపోయాయి ఈ చిత్రం కలెక్షన్లు.ఇక '14 రీల్స్ ప్లస్‌' బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట కలిసి నిర్మించిన ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ల వివరాలను చూసినట్లయితే 'శ్రీకారం' చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 8.93 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 8.07 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చాలా పెద్దది కాబట్టి..ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా బాగా రాణించాల్సి ఉంది. కానీ నిన్న చాలా వరకూ డ్రాప్స్ కనిపించాయి.ఇక ఇలాగే కనుక ఈ సినిమా కలెక్షన్స్ డల్ అయితే నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవు. చూడాలి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు పుంజుకుంటుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: