నందమూరి బాలక్రిష్ణ గత రెండున్నర దశాబ్దాలుగా చాలా వెరైటీ మూవీస్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సమరసింహారెడ్డి మూవీ తరువాత బాలయ్య రూటే సెపరేట్ అయింది. ఆయన యాక్షన్, ఫ్రాక్షన్ అంటూ చాలా మూవీస్ ని ఆ కోవలో చేశారు.


ఇక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా బాలయ్య  వరసగా చేస్తూ వచ్చారు. మధ్యలో శ్రీరామరాజ్యం పేరిట పౌరాణికాన్ని బాపూ డైరెక్షన్ లో చేశారు. ఇక 2017లో క్రిష్ డైరెక్షన్ లో గౌతమి పుత్ర శాతకర్ణి పేరిట చారిత్రాత్మక మూవీ చేశారు. అయితే బాలయ్యకి హిట్ ఫార్ములా మరోటి కూడా ఉంది. ఆయన పంచె కట్టు కట్టి చేసిన సినిమాలు ఏవీ ఫెయిల్ కాలేదు. అవన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.


పంచెకట్టులో బాలయ్య అదుర్స్ అని ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్ కూడా అంటారు. అయితే 1997 సంక్రాంతికి వచ్చిన పెద్దన్నయ్య మూవీ తరువాత బాలయ్య మళ్ళీ పంచె కట్టు కట్టింది లేదు. అయితే ఆ మధ్య క్రిష్ణ వంశీ డైరెక్షన్ లో రైతు మూవీ బాలయ్య చేస్తారని అనుకున్నారు. అది కనుక వర్కౌట్ అయి ఉంటే బాలయ్య పంచెకట్టుతో అలరించేవారు. కానీ ఆ మూవీ అలా సడెన్ గా  సైడ్ అయిపోయింది.


అయితే అఖండ తరువాత బాలయ్య మరో నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టారు. వాటిలో ఒకటి గ్రామీణ ప్రాంత నేపధ్యం కలిగిన కధతో ఉంటుందని అంటున్నారు. అదే కనుక నిజమైతే బాలయ్య పంచెకట్టుతో దంచికొట్టడం ఖాయమే అంటున్నారు. బాలయ్య పంచెకట్టుతో పల్లెటూరు కధ అయితే చాలా కొత్తగా ఉంటుందని, ఈనాటి జనరేషన్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని ఫ్యాన్స్ అపుడే సంబరపడుతున్నారు. మరి చూడాలి బాలయ్య చేత పంచె కట్టు కట్టించి దుమ్ము దులిపించే ఆ డైరెక్టర్ ఎవరో, ఆ బ్యానర్ ఏంటో అన్నది. సో వెయిట్ చేయడమే.






మరింత సమాచారం తెలుసుకోండి: