కేజిఎఫ్ రెండవ భాగం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎదురు లేకుండా ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూనే ఉండగా తాజాగా విడుదలైన ఆచార్య సినిమాకు నెగిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు కలిసి వచ్చింది. ఆ విధంగా ఈ వారం కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకోవడం ఖాయం. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టగా రాబోయే సరికొత్త రికార్డులను కూడా నమోదు చేసుకుంటూ పోతుంది.

ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక 1000 కోట్ల క్లబ్లోకి ఈ సినిమా చేరడం జరిగింది. ఈ సినిమా ఇంతటి ఆదరణ పోవడానికి కారణం ఈ సినిమా యొక్క కంటెంట్ అనే చెప్పాలి. ఇంతటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రం అన్ని భాషలలో కూడా మొదలు పెట్టి ఇప్పటికి అలుపెరగని సినిమాగా ముందుకు పోతూనే ఉంది. కేవలం 15 రోజుల్లోనే ఈ చిత్రం ఈ స్థాయి రికార్డులను కొట్టింది అని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఈ సినిమా కలెక్షన్లు మరింత ఎక్కువగా సాధించే అవకాశం లేకపోలేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో వెయ్యి కోట్లు దాటిన మొదటి సినిమాగా ఈ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది.

అలాగే గ్లోబల్ మార్కెట్ లో ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా మిగిలింది. దీనికంటే ముందు ఆర్ ఆర్ ఆర్ సినిమా 1000 కోట్ల మార్కును అందుకుంది. బాహుబలి సినిమా రికార్డులను కొట్టగలిగిన సత్తా కేజిఎఫ్ సినిమా కు ఉందని చెప్తున్నారు. ఆ విధంగా ఈ సినిమా ముందుకు వెళ్లడం జరుగుతుంది. నార్త్ ఇండియా మార్కెట్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా యొక్క ప్రభావం భారీ స్థాయిలోనే ఉంది.అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది బాహుబలి. ఇప్పటిదాకా 354 కోట్ల వసూళ్లను అందుకున్న ఈ సినిమా త్వరలోనే బాహుబలి 510 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం అని అంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలో నటించగా ఈ సినిమా యొక్క మూడవ భాగం స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: