బుల్లితెరపై యాంకర్ లాస్య అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ముఖ్యంగా రవి లాస్య అనే పేరు బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు..అయితే ఈ మధ్యకాలంలో ఏమి అసలు ఎక్కడా కనిపించలేదు కేవలం అప్పుడప్పుడు ఒక స్పెషల్ షోలలో మాత్రమే కనిపిస్తు ఉంటుంది. పూర్తిగా ఫ్యామిలీ జీవితానికి అంకితం అయ్యింది లాస్య. ఇక బిగ్ బాస్ లో అడిగి పెట్టినా ఆమె కొన్ని సినిమాలలో నటించి మెప్పించింది. అయితే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఇక తన పర్సనల్ విషయం తో పాటు లైఫ్ స్టైల్ కు సంబంధించిన వీడియోలను కూడా ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.



అయితే తాజాగా యాంకర్ లాస్య తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రి పాలైనట్లుగా తెలుస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా లాస్య భర్త మంజునాథ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేయడం జరిగింది. లాస్య హాస్పిటల్ లో బెడ్ మీద పడుకొని ఉండగా ఒక వీడియోను తీసి ఆయన గెట్ వెల్ సూన్ అంటూ క్యాప్షన్ ని తెలియజేయడం జరిగింది. దీంతో యాంకర్ లాస్యకు అసలు ఏం జరిగింది.. ఆమె ఎందుకు హాస్పిటల్లో చేరింది అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈమె హాస్పిటల్లో చేరడంపై ఇంకా క్లారిటీ రాలేదు .మరొకవైపు ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, నేటిజెన్లు..సైతం సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.



అయితే కొంతమంది మాత్రం యాంకర్ లాస్యకు తీవ్రమైన జ్వరం రావడంతో ఇలా హాస్పిటల్లో చేరింది అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి అసలు విషయం తెలియాలి అంటే లాస్య లేదా తన భర్త మంజునాథ ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా యాంకర్ లాస్య హాస్పిటల్ కి చేరడంతో ఆమె అభిమానుల సైతం కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: