నాని హీరోగా ప్రస్తుతం దసరా అనే సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించడానికి సిద్ధమవుతుంది. డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ట్రై చేస్తూ ఉండగా ఈ సినిమాలో నాని లుక్ ఎం తో రగ్డ్ గా కనిపించడం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ప్రేక్షకులలో మంచి ఆసక్తిని కనపరచగా ఇప్పుడు సినిమాపై అంచనాలను కూడా భారీ స్థాయిలో పెంచాయని చెప్పవచ్చు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన నేను లోకల్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.
 చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగి పోయాయి. పుష్పతరహాలో ఈ సినిమాలోని నాని పాత్ర ఉండబోతుంది అని చెబుతున్న నేపథ్యంలో అంతటి స్థాయిలోనే ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు.

ఇటీవల నాని నటించిన అంటే సుందారనికి సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. దాంతో ఈ సినిమా ద్వారా అందరిని అలరించాలని ఆయన భావిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పెద్దగా జరగకపోవడం నిర్మాతను ఎంతగానో నిరుత్సాహపరుస్తుందట. చాలా రోజులుగా ఈ సినిమా యొక్క బిజినెస్ చేయాలని భావిస్తున్న నిర్మాతకు పెద్దగా రేటు పలకకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఆయన ఉన్నాడని అంటున్నారు. నటీనటులందరూ భారీ రెమ్యునేషన్ తీసుకొని చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే తప్పకుండా ఓ వండర్ జరగాల్సిందే అని అంటున్నారు. నాని సినిమాకు విడుదలకు ముందే ఈ విధమైన పరిస్థితి రావడం చిత్రమైన విషయం అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: