లైగర్ ప్లాప్ తో పూరి జగన్నాధ్ మళ్ళీ క్రిందకు పడిపోయాడు. విజయ్ దేవరకొండతో చేస్తున్న జనగణమన ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది.


లైగర్ రిజల్ట్ చూసి భయపడ్డ నిర్మాతలు ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లిపోయారు. దీంతో పూరి కొత్త హీరోని వెతుక్కునే పనిలో ఉన్నారు. రామ్ పోతినేని, బాలయ్యతో పాటు పలువురు హీరోలను ప్రసన్నం చేసుకునేందుకు ట్రై చేస్తున్నారట.వారిద్దరిలో ఎవరు అవకాశం ఇచ్చినా సినిమా స్టార్ట్ కావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్ తో వారు బిజీగా ఉన్నారు. కాగా ఇబ్బందుల్లో ఉన్న పూరిని ఆదుకోవడానికి చిరంజీవి నేనున్నాను అంటూ ముందుకు వచ్చారట.


సినిమా చేద్దాం అంటూ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. దీంతో పూరి ఉబ్బితబ్బిబవుతున్నారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు పూరితో చిరంజీవి ఆన్లైన్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి. మాటల్లో మాటగా నాకు వినిపించిన ఆటో జానీ స్క్రిప్ట్ ఏమీ చేశావ్? పక్కన పెట్టేశావా? అన్నారట.. ఆ స్క్రిప్ట్ ఉంది. కానీ కొత్త స్క్రిప్ట్ తో మూవీ చేద్దామని పూరి చిరంజీవితో అన్నారు. తప్పకుండా మీరు స్క్రిప్ట్ తో రండి మన కాంబినేషన్ లో మూవీ చేద్దామని హామీ కూడా ఇచ్చాడు.


చిరంజీవి ఆఫర్ కి పూరి ఆనందంతో ఆకాశంలో తేలారు. ఇక పూరి రెడీ చేసిన స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చి ప్రాజెక్ట్ ఓకే అయితే ఆయనకు మంచి లిఫ్ట్ దొరికినట్లే. కమ్ బ్యాక్ కావడానికి ఒక అవకాశం వచ్చినట్లే. చిరు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూరి ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి మరి.గతంలో చిరంజీవికి పూరి ఆటో జానీ టైటిల్ తో ఓ స్టోరీ వినిపించాడు. అది పూర్తి స్థాయిలో చిరంజీవిని సంతృప్తి పరచలేకపోవడంతో ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదట.
ఆ స్క్రిప్ట్ గురించి చిరంజీవి ఇన్నాళ్లకు పబ్లిక్ లో పూరీని అడగడం జరిగిందట.. చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు మూవీలో ఒక పాత్ర పేరు ఆటో జానీ కావడం విశేషం. పూరిపై చిరంజీవికి చాలా విశ్వాసం ఉంది. తన వారసుడు రామ్ చరణ్ ని లాంచ్ చేసే బాధ్యత పూరి జగన్నాధ్ కి చిరంజీవి ఇచ్చారు. పూరి తెరకెక్కించిన చిరుత మూవీతో చరణ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సక్సెస్ ఫుల్ స్టార్ గా ఆయన ఎదిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: