‘సీతారామం’ ‘బింబిసార’ ‘కార్తికేయ 2’ ల తరువాత నెలలు గడిచిపోతున్నప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సరైన హిట్ పడకపోవడంతో ధియేటర్లు అన్నీ బోసిపోతున్నాయి. దీనితో బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు. దసరా రేస్ కు వచ్చిన టాప్ హీరోల సినిమాలు కూడ అంతంత మాత్రంగానే నడవడంతో దీపావళి రేస్ కు వచ్చిన చిన్న సినిమాలలో ఎదో ఒక సినిమా హిట్ అవుతుంది అని పెట్టుకున్న ఇండస్ట్రీ ఆశలు గల్లంతు అయ్యాయి.


దీపావళి రేస్ కు వచ్చిన ‘ఓరి దేవుడా’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలక్షన్స్ లేవు. ఈసినిమాతో పోటీగా విడుదలైన ‘ప్రిన్స్’ ‘జిన్నా’ ల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. డబ్బింగ్ సినిమాగా విడుదలైన ‘సర్ధార్’ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ దానివల్ల ఇండస్ట్రీకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. దీపావళి తరువాత మొదలుకానున్న నవంబర్ డిసెంబర్ లు ఇండస్ట్రీకి మరింత డల్ పిరియడ్ గా మారే ఆస్కారం ఉంది అన్న సంకేతాలు వస్తున్నాయి.




ఈవారం విడుదలైన రాజేంద్రప్రసాద్ ‘అనుకోని అతిధి’ టాక్ కూడ చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు. ఇక నవంబర్ లో విడుదలకాబోతున్న ‘బొమ్మ బ్లాక్ బష్టర్’ ఆతరువాత వచ్చే సమంత ‘యశోద’ అల్లరి నరేష్ ‘మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీల పై కూడ భారీ స్థాయిలో అంచనాలు లేవు. ఆతరువాత వచ్చే ‘అహింస’ ‘హంట్’ సినిమాల పరిస్థితి కూడ అలాగే ఉంది. దీనితో రాబోతున్న నవంబర్ లో కూడ టాలీవుడ్ దళ్ సీజన్ కొనసాగే ఆస్కారం ఉంది.


ఇక డిసెంబర్ మొదటివారంలో వచ్చే ‘హిట్ 2’ పై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఎంతవరకు ఈమూవీ సగటు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్న విషయమై సందేహాలు ఉన్నాయి. ఈమూవీ తరువాత మరికొన్ని చిన్న సినిమాలు వస్తున్నప్పటికీ వాటి పై అంచనాలు లేవు. దీనితో అందరి దృష్టి సంక్రాంతి భారీ సినిమాల హంగామా పైనే ఉంది. సంక్రాంతి సీజన్ వచ్చే వరకు ధియేటర్లకు జనం రాకపోతే అప్పటివరకు ధియేటర్ల పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు టెన్షన్ లో ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: