డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఎన్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. ఇక ఇదే సమయంలో మహేష్ తల్లి ఇందిరా దేవి మృతి చెందడంతో సెకండ్ షెడ్యూల్ మరింత ఆలస్యం కానుంది వెకేషన్ కోసం వెళ్ళిన మహేష్ బాబు తన కుటుంబంతో తిరిగి వచ్చి షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో పూజ హెగ్డే కాలికి గాయం కావడంతో ఈ షెడ్యూల్ కూడా డిసెంబర్లో ప్రారంభమవుతున్నట్లు సమాచారం.

ఇదంతా ఇలా ఉండగా త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని మరొకసారి అల్లు అర్జున్తో నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో వీరి కలయికలో వచ్చిన చిత్రాలు అన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా నాలుగవ సినిమా అని వీరి కాంబినేషన్లో తెరకెక్కిస్తూ ఉండడంతో అటు అభిమానుల సైతం ఈ చిత్రం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ కూడా పుష్ప -2 సినిమా షూటింగ్ గత కొద్ది రోజుల క్రితం మొదలైనట్లు తెలుస్తోంది.


ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కలిసి ఒక భారీ చిత్రాన్ని చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాసుతో సినిమా చేయబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది మధ్యలో మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఇక చివరిగా వీరిద్దరి కాంబినేషన్లో అలా వైకుంఠపురం సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. మరి నాలుగవ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి. ఇక అల్లు అర్జున్ ఐకాన్ అనే సినిమా కూడా మధ్యలో నిలిచిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: