యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. మరికొన్ని రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్ ,  కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఆ తర్వాత కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో గొప్ప గుర్తింపు ను తెచ్చుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎన్నో మూవీ లలో ఎంతో మంది హీరోయిన్ లలో నటించాడు. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , గోవా బ్యూటీ ఇలియానా తో కూడా రాఖి మరియు శక్తి మూవీ లలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన రాఖీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించలేదు. కాకపోతే ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ తన నటన తో ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే ఈ మూవీ లోని నటనకు ఎన్టీఆర్ కు విమర్శల నుండి కూడా సూపర్ ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో శక్తి మూవీ తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ... ఇలియానా తో నటించిన రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి పెద్ద ప్రజాదరణ పొందలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: