టాలీవుడ్‌లో చాలామంది హీరోల మధ్య మంచి స్నేహం బంధం ఉంది.అందులో మొదటగా చెప్పుకోవాల్సిన బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్, గోపిచంద్.వీరి స్నేహం వర్షం సినిమా కంటే ముందే మొదలయ్యింది. అయితే ఇంత మంచి స్నేహితుల మధ్య కూడా ఓ హీరోయిన్ విషయంలో గొడవ జరిగిందట. ఆ విషయాన్ని వేరెవరో కాదు.. మన బాలయ్య చెప్పారు.
బాలయ్య సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. వీటితో పాటు... బాలకృష్ణ ఓటీటీలో టాక్ షో కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ NBK షో కి హోస్టుగా వ్యవహరించడం వల్ల బాలయ్యకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాలయ్య సెకండ్ సీజన్‌లో అదిరిపోయే గెస్టులను ఇన్వైట్ చేస్తూ వస్తున్నారు. బాలయ్య షోకు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చిన విషయం తెలిసిందే.
ప్రభాస్ ఎపిసోడ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ (Glimpse), ప్రొమో ఇప్పుడు తెగ వైరల్ (Viral)అవుతోంది. ప్రభాస్‌ ఎపిసోడ్ త్వరగా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ నెటిజన్లు, అభిమానులు జోరుగా కామెంట్లు పెడుతున్నారు.
ఇక బాలయ్య గోపిచంద్, ప్రభాస్‌ను అనుష్క విషయంలో కూడా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఆ పేరు అయితే ప్రొమోలో కనిపించలేదు కానీ.. ఓ హీరోయిన్ ఫోటో చూపిస్తూ... బాలయ్య ప్రభాస్, గోపిచంద్‌ను ఆట పట్టించినట్లు తెలుస్తోంది. మనోడే పడేస్తాడో... కటౌట్ చూసి మనోడుకు పడిపోతారో అంటూ బాలయ్య ప్రభాస్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.
2008లో ఓ హీరోయిన్ విషయంలో ఇద్దరు గొడవ పడ్డారంటూ..బాలయ్య ప్రభాస్‌, గొపిచంద్‌ను ఉద్దేశించి చెప్పే మాటలు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్... నేను అయితే పడిపోలేదు...నువ్వేమైనా పడిపోతే చెప్పేయ్ రా అంటూ ప్రభాస్ గోపిచంద్‌కు చెప్పే మాటలు ఇప్పుడు ప్రొమోలో మరింత ఆసక్తి పుట్టిస్తున్నాయి.
2008లో ప్రభాస్ బుజ్జిగాడు సినిమా చేశారు. అదే సంవత్సరం గోపిచంద్ శౌర్యం సినిమా తీశారు.    ప్రభాస్ బుజ్జిగాడు సినిమా హీరోయిన్ త్రిష. ఇక త్రిష ప్రభాస్ వర్షం సినిమాలో కూడా హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. వర్షం సినిమాలో ప్రభాస్, గోపిచంద్... హీరో విలన్‌గా నటించి.. హీరోయిన్ త్రిష కోసం గొడపడతారు.  ఈ సినిమా ముగ్గురుకి మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ.  అయితే వర్షం సినిమా వచ్చింది 2004లో.ఇక గోపిచంద్ సినిమా శౌర్యం విషయానికి వస్తే.. అందులో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించింది. దీంతో ఇప్పుడు వీరిద్దరు గొడవ పడింది... ఎవరి కోసం అంటూ అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. ఏదైమైనా ఈనెల 30 మొత్తం ఎపిసోడ్ చూస్తే తప్పా దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
బాలయ్య షోలో మెరిసిన ప్రభాస్ చాలా కాలం తర్వాత మంచి వింటేజ్ ఎనర్జీ తో ఉండటం చూసి ఫ్యాన్స్ కూడా మంచి ఎమోషనల్ అవుతుండగా మేకర్స్ నిన్న రిలీజ్ చేసిన ఫుల్ ప్రోమో కేజ్రీగా మారింది. ఇక దీనితో ఈ ప్రోమో కి ఇప్పుడు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ప్రభాస్, గోపీచంద్ అలాగే రామ్ చరణ్ కాల్’తో బాలయ్య చేసిన రచ్చతో ఈ ఎపిసోడ్ ప్రోమోకు 12 గంటల్లో ఏకంగా 3 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. దీని బట్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆడియెన్స్ సహా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. డిసెంబర్ 30న ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది.
ఇక ఈ ఎపిసోడ్’లో ప్రభాస్ తన పెదనాన్న ఏవీ ప్లే చేయగానే.. ఎమోషనల్ అయ్యాడు. ఐ లవ్ హిమ అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఇంటికి శతృవు వచ్చినా అతడ్ని మర్యాద చేసి గౌరవంతో పంపాలని.. ఏమైనా ఉంటే బయట చేసుకోవాలని పెదనాన్న చెబుతుండేవాడన్నారు ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: