ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. తన సోదరుడు ఎన్. సుభాష్ చంద్రబోస్ అలాగే ఎన్. లింగస్వామి ఇద్దరూ కలిసి 2006లో తిరుపతి బ్రదర్స్ పేరిట కోలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాల ద్వారా ఎన్నో మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటిసారి జయం రవి, భావన హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ ఈజీల్ దర్శకత్వంలో తెరకెక్కిన దీపావళి సినిమా మొదటిసారి తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్లో నిర్మించబడింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి


ఇకపోతే ఇప్పుడు డైరెక్టర్ ఎన్.లింగు స్వామి కూడా తమ నిర్మాణ సంస్థ అయినా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో కమలహాసన్ తో సినిమా చేయబోతున్నాము అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే కమలహాసన్ సినిమాల విషయానికి వస్తే భారతీయుడు  2 చిత్రంలో బిజీగా ఉన్న.. విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఈ వయసులో కూడా ఆయన బ్లాక్ బాస్టర్ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ టు చిత్రం తర్వాత డైరెక్టర్ మణిరత్నంతో తన 234వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న కమలహాసన్ ఈ సినిమా తర్వాత డైరెక్టర్ లింగుస్వామితో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు సమాచారం. ఈ వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ భారీ కమర్షియల్ విజయాలను అందుకుంటుండడంతో ఈయనపై మరింత ప్రెషర్ పెరిగిందని చెప్పవచ్చు.  అభిమానులు ఈయన నుంచి సరికొత్త కథలను కోరుకుంటున్నారు మరి అభిమానుల కోరిక మేరకు కమలహాసన్ ఎలాంటి సినిమా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో తెలియాల్సి ఉంది . మొత్తానికైతే విక్రమ్ సినిమాతో తన ఖాతాలో కమర్షియల్ జుట్టు వేసుకున్న కమలహాసన్ ఇండియన్ 2చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: