ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోల్లో అడివి శేషు కూడా ఒకరు. టాలీవుడ్ సినీ  ఇండస్ట్రీలో కర్మ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా సినిమాలో నటించి పాపులర్ అయ్యాడు. దాని అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో నటించే అవకాశాన్ని సైతం దక్కించుకున్నాడు. అడివి శేషు కి మరింత పాపులారిటీ దక్కింది. దీంతో ఈ సినిమా అనంతరం టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల నుండి వరుస ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి. 

అయితే అడవి శేషు క్షణం సినిమాతో రైటర్ గా మరియు హీరోగా మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఆ సినిమా నుండి ప్రతి సినిమాలో తనదైన నటనతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. అయితే గతంలో అడివి శేషు నటించిన క్షణం సినిమాతో మొదలై తాజాగా విడుదలైన హిట్ టు సినిమా వరకు అన్ని హిట్ సినిమాలే అందుకున్నాడు ఈ యంగ్ హీరో. త్వరలోనే గూఢచారి టు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అడివి శేషు. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ తాజాగా మొదలైంది.అయితే ఇటీవల మేజర్ సినిమాతో పని ఇండియా సక్సెస్ను అందుకున్న ఈయన గూడచారి 2 సినిమాతో కూడా పాన్ ఇండియా లెవెల్ లో

విజయాన్ని పొందుకోవాలి అని భావిస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగులో నే కాకుండా మరో ఇతర ఐదు భాషల్లో కూడా రిలీజ్ కానుంది. అయితే తాజాగా అడివి శేషుకి సంబంధించిన కొన్ని కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే అడివి శేషు ఎప్పుడు పోలీస్ గూడాచారి ఏజెంట్ లాంటి సినిమాలో తప్ప నార్మల్ సినిమాలు చేయడా..? లేక చేయలేడా..? ఈ సినిమాలే కాకుండా వేరే సినిమాలు చేస్తే కూడా బాగుంటుంది.. ఈ గుర్తింపు కంటే నెక్స్ట్ లెవెల్ గుర్తింపు పొందాలి అంటే కచ్చితంగా అన్ని రకాల సినిమాలు చేయాల్సి ఉంటుంది.. సాధారణంగా టాలీవుడ్ ని ఇండస్ట్రీలో స్టార్ హీరో అవ్వాలంటే మాస్ మసాలా సినిమాలు కచ్చితంగా చేయాలి అని అంటున్నారు చాలామంది విశ్లేషకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: